మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: తన ఉమ్మత్ (అనుయాయుల జాతి) పట్ల తాను ఎక్కువగా భయపడే విషయం చిన్న షిర్క్, అంటే ప్రదర్శనా తత...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాల...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం: అవిశ్వాసపు ఆచరణలు అనదగిన ఒక ఆచరణను గురించి, మరియు అఙ్ఞాన కాలపు సంప్రదాయాలలో ఒక దానిని గురించి (రెండు విషయాల...
అబూ మర్తద్ అల్ ఘనవియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధులపై కూర్చోవడాన్ని నిషేధించినారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధుల ఎదురుగా నమాజు చేయడాన్ని, ఖిబ...
అబూ తల్హహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు – ఏ ఇంటిలోనైతే కుక్కగానీ లేక చలనం కలిగిన జీవరాసుల చిత్రపటాలు గానీ ఉన్నట్లైతే ఆ ఇంటిలోన...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రయాణంలో ఉన్న వారిని, ఒకవేళ వారి వెంట కుక్క గానీ ఉన్నట్లయితే, లేక వారి వెంట ఉన్న జంత...

మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మహ్’మూద్ ఇబ్న్ లబీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా మీ విషములో నేను భయపడే విషయం ఏమిటంటే – మీరు చిన్న షిర్క్ కు పాల్బడతారేమోనని.” అక్కడ ఉన్న వారు ఇలా ప్రశ్నించారు “చిన్న షిర్క్ అంటే ఏమిటి ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం?” దానికి ఆయన “ప్రదర్శనా తత్వము (ఏ మంచి పనినైనా లోకులు మెచ్చుకోవాలనే సంకల్పముతో చేయడం) మరియు కాపట్యము” అన్నారు. తీర్పు దినమునాడు ప్రజలకు వారి వారి ప్రతిఫలం ఇవ్వబడుతున్నపుడు, సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వారితో ఇలా అంటాడు: “ప్రపంచ జీవితంలో (మీరు అల్లాహ్ ను వదిలి) ఎవరినైతే ఆరాధిస్తూ వచ్చినారో వారి వద్దకు వెళ్ళండి, వెళ్ళి వారి వద్ద చూడండి (మీ కొరకు) ఏమైనా ప్రతిఫలం ఉన్నదేమో.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ప్రజలలో రెండు విషయాలు ‘కుఫ్ర్’ (అవిశ్వాసము) యొక్క చిహ్నాలుగా ఉన్నాయి - వంశావళిని కించపరచడం, ఎవరైనా చనిపోయినపుడు ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం.”

అబూ మర్తద్ అల్ ఘనవియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సమాధులపై కూర్చోకండి మరియు సమాధులకు అభిముఖముగా (సమాధి తన ఎదురుగా ఉండేలా) నమాజు ఆచరించకండి.”

అబూ తల్హహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కుక్క మరియు చిత్రపటం ఉన్న ఇంటిలోనికి దైవదూతలు ప్రవేశించరు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “మీలో ఎవరి దగ్గరికైనా షైతాను వచ్చి “ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు, ఫలానా, ఫలానా దానినెవరు సృష్టించినాడు” అని ప్రశ్నిస్తాడు. చివరికి “మరి నీ ప్రభువును (అల్లాహ్’ను) ఎవరు సృష్టించినాడు” అంటాడు. మీలో ఎవరైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటే, అల్లాహ్ యొక్క రక్షణ అర్థించాలి మరియు దాని నుండి దూరం కావాలి”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ ఇలా పలికినాడు: ‘ఎవరైతే నా వలీ పట్ల (వలీ – ధర్మనిష్టాపరుడైన అల్లాహ్ యొక్క దాసుడు) శతృత్వం వహిస్తాడో నేను అతనిపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఏదైతే అతనిపై ‘ఫర్జ్’ చేసినానో అది నాకు అత్యంత ఇష్టమైనది; నా దాసుడు దాని ద్వారా తప్ప నాకు చేరువ కాలేడు. ఇంకా అతడు ‘నఫీల్’ ఆచరణలు ఆచరిస్తూ నాకు ఇంకా చేరువ అవుతూనే ఉంటాడు, ఎంతగా అంటే, నేను అతడిని ప్రేమించేంత వరకు. నేను అతడిని ప్రేమించినట్లయితే నేను అతడి వినికిడి శక్తినవుతాను, దేని ద్వారానైతే అతడు వింటాడో, నేను అతడి దృష్టినవుతాను, దేనిద్వారానైతే అతడు చూడగలుగుతాడో, నేను అతడి చేతినవుతాను, దేని ద్వారానైతే అతడు (శత్రువులను) ప్రతాడించుతాడో, నేను అతడి కాలునవుతాను, దేని ద్వారానైతే అతడు నడుస్తాడో. అతడు దేని కొరకైనా అర్థించినట్లయితే, నేను అతనికి తప్పనిసరిగా ప్రసాదిస్తాను; అతడు నా నుండి రక్షణ కోరితే, నేను అతనికి రక్షణ ప్రసాదిస్తాను. ఒక విశ్వాసి ప్రాణాలను తీసే విషయంలో సంకోచించినంతగా, నేను ఏ విషయములోనూ సంకోచించను. ఎందుకంటే అతడు మృత్యువును ఇష్టపడడు, మరియు అతనికి కష్టం కలిగించడాన్ని నేను ఇష్టపడను.”

అల్ ఇర్బాజ్ ఇబ్న్ సారియహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక రోజు మా మధ్యన (కూర్చుని) ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడినారు. నిలబడి హితబోధ చేసినారు. ఆ హితబోధ మా హృదయాలను భయంతో కంపించేలా చేసింది, మా కళ్ళనుండి కన్నీళ్ళు వచ్చేలా చేసింది. మాలో ఒకరు ఇలా అన్నారు: “మీరు చేసిన హితబోధ, శాశ్వతంగా విడిచి వెళ్ళబోతున్న వారు చేసిన హితబోధలా ఉన్నది. మా కొరకు ఏదైనా ప్రమాణాన్ని ఉపదేశించండి”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు భయపడండి, మరియు ఒకవేళ మీపై ఒక హబషీయుడిని (బానిసను) అధికారిగా నియమించినా సరే ఆయనను అనుసరించండి. నా తరువాత మీలో జీవించి ఉన్న వారు తీవ్రమైన విబేధాలు చూస్తారు. కనుక నా సున్నత్’ను మరియు సన్మార్గగాములైన ఖలీఫాల (ఖులాఫా అర్రాషిదీన్ అల్ మహిదియ్యీన్ ల) సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండండి; మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకుని ఉండండి. (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి; ఎందుకంటే (ధర్మములో) కొత్తగా ప్రవేశపెట్టబడే ప్రతి విషయమూ మార్గభ్రష్ఠత్వమే.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే విధేయత నుండి తొలగిపోయి, జమాఅత్ నుండి వేరై వెళ్ళిపోయినట్లయితే, తరువాత అతడు అదే స్థితిలో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము (ఇస్లాంకు పూర్వపు అఙ్ఞాన కాలము) నాటి చావుతో సమానము. ఎవరైతే అంధవిశ్వాసపు పతాకం క్రింద, మార్గదర్శనం లేని కారణం కొరకు, తన జాతి లేక తెగ అనే ఉన్మాదముతో, లేదా తన జాతి గర్వానికి / అహంకారానికి సమర్ధనగా, లేదా తన జాతి జనుల అహంకారానికి సమర్ధనగా, లేదా తన స్వీయప్రయోజనాల కొరకు కోపగ్రస్థుడై జగడానికి / యుద్ధానికి దిగేవాడు, లేదా యుద్ధానికి దిగమని పిలిచేవాడు – ఆ జగడములో లేదా యుద్ధములో చనిపోతే, అతని చావు ‘జాహిలియ్యహ్’ కాలము నాటి చావుతో సమానము; ఎవరైతే నా ఉమ్మత్’తో చేసిన ఆఙ్ఞానువర్తన ఒడంబడికను తిరస్కరించి, వారిలోని విశ్వాసులైనవారి మాటను కూడా వినకుండా, వారిలో మంచివారు (ధర్మవర్తనులు), చెడ్డవారు అనే తేడా లేకుండా చంపుతాడో, వారిలో ఎవరితోనైనా చేసుకుని ఉన్న ఒడంబడికను నెరవేర్చడో, ఉల్లంఘిస్తాడో – అటువంటివాడు నాకు చెందిన వాడు కాడు, నేను వాడికి చెందిన వాడిని కాను.”

మాఖిల్ ఇబ్న్ యసార్ అల్ ముజనియ్యి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను – “అల్లాహ్ అధికార పదవిలో నియమించిన ఎవరైనా సరే, తాను చనిపోయే దినమున, తన అధికారము క్రింద ఉన్న వారిని మోసం చేస్తున్న స్థితిలో చనిపోతే, అటువంటి వానికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించినాడు”.

ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.” ఇది విని అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు “ఓ ప్రవక్తా! అటువంటి పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాడకూడదా?” దానికి ఆయన “అతడు నమాజులను స్థాపిస్తూ ఉన్నంత వరకు అతనికి వ్యతిరేకంగా పోరాడ రాదు” అన్నారు.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి (అటువంటి పరిస్థుతులలో) మా కొరకు మీ ఆదేశము ఏమిటి ఓ ప్రవక్తా ?” అని అడిగారు. దానికి ఆయన “మీ విధులను నిర్వర్తించండి, మీ హక్కుల కొరకు అల్లాహ్ ను ప్రార్థించండి” అన్నారు.”