- ఈ హదీసు ద్వారా షైతాను కలిగించే చెడు ఆలోచనల నుండి, అతడి ప్రమాదం నుండి దూరంగా ఉండాలని, వాటిని గురించి ఆలోచించ వద్దని, అల్లాహ్ వైపునకు తనను తాను మరల్చుకోవాలని తెలుస్తున్నది.
- మనిషి హృదయంలో కలిగే ఏ ఆలోచనైనా, అది షరియత్ కు వ్యతిరేకంగా ఉంటే అది షైతాను నుండి వచ్చినదై ఉంటుంది.
- అల్లాహ్ యొక్క ఉనికిని గురించి ప్రశ్నించడం, దానిని గురించి ఆలోచన చేయడం నిషేధము, అలాగే ఆయన సృష్టితాలను గురించి ఆయన ఆయతులను గురించి కూడా.