ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు – ఆచరణలు అన్నీ వాటి వెనుక ఉండే సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి. ఈ నియమం సాధారణంగా ఆచరణలు అన్ని...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతున్నారు: ఎవరైనా ఈ ధర్మములో (ఇస్లాంలో) ఏదైనా కొత్త విషయాన్ని సృష్టించినట్లయితే, లేదా ఖుర్’ఆన్ మరియ...
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి,...
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి త...
అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఇస్లాం (మూ...
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంను ఒక పటిష్టమైన నిర్మాణంతో పోల్చారు, దాని ఐదు స్తంభాలు ఆ నిర్మాణానికి బలాన్ని, ఆధారాన్ని చేకూరుస్తాయి. ఇస్లాం...
ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాసులపై అల్లాహ్ యొక్కహక్కు మరియు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కును గురించి వివరిస్తున్నారు. దాసులపై అల్లాహ్ యొక...

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా మా ఈ విషయములో (ఇస్లాంలో), దానికి చెందని ఏదైనా విషయాన్ని ప్రవేశ పెట్టినట్లయితే అది తిరస్కరించబడుతుంది.” ముత్తఫఖున్ అలైహి. మరియు సహీహ్ ముస్లింలో ఇలా ఉంది: “ఎవరైనా మన ఈ విషయానికి (ఇస్లాం కు, షరియత్’కు) అనుగుణంగా లేని పనిని చేసినట్లయితే అది తిరస్కరించబడుతుంది.”

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి, నిగనిగలాడే నల్లని తల వెంట్రుకలు కలిగిన ఒక వ్యక్తి మా ముందుకు వచ్చినాడు. దూరం నుండి ప్రయాణించి వస్తున్న జాడలేవీ అతనిపై లేవు, మాలో ఎవరూ కూడా అతడిని ఎరుగరు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అభిముఖంగా, తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి, తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి కూర్చున్నాడు. తరువాత అతడు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! నాకు ఇస్లాం అంటే ఏమిటో చెప్పు?” అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట” అని సమాధాన మిచ్చినారు. అది విని అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. మాకు ఆశ్చర్యం అనిపించింది – అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్న అడుగుతున్నాడు, మరియు ఆయన సత్యమే పలికినారని ధృవీకరిస్తున్నాడు కూడా. తరువాత అతడు “విశ్వాసము అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విశ్వాసము అంటే – నీవు అల్లాహ్’ను విశ్వసించుట, ఆయన దూతలను (దైవదూతలను) విశ్వసించుట, ఆయన గ్రంథాలను విశ్వసించుట, ఆయన సందేశహరులను విశ్వసించుట, అంతిమ దినమును విశ్వసించుట మరియు విధివ్రాతను, అందులోని మంచిని చెడును విశ్వసించుట” అని సమాధానమిచ్చినారు. దానికి అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. తరువాత అతడు “ఇహ్’సాన్ అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇహ్’సాన్ అంటే – నీవు అల్లాహ్’ను (నీ ఎదురుగా) చూస్తున్నట్లుగా ఆయనను అరాధించుట, నీవు ఆయనను చూడలేక పోయినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు (అని గమనించు)” అని సమాధాన మిచ్చినారు. తరువాత అతడు “ప్రళయ ఘడియను గురించి చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దానిని గురించి, ప్రశ్నించ బడుతున్న వాడు, ప్రశ్నిస్తున్న వాని కంటే ఎక్కువగా ఎరుగడు” అని సమాధాన మిచ్చినారు. అతడు “దాని సంకేతాలైనా తెలియజేయి నాకు” అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “బానిస యువతి తన యజమానురాలికి జన్మనిస్తుంది, వొంటిపై బట్టలు, కాళ్ళకు చెప్పులు కూడా లేని నిరుపేద పశువుల కాపర్లు ఆకాశ హర్మ్యాలను నిర్మించడం’లో ఒకరితో నొకరు పోటీ పడుటను చూస్తావు నీవు” అన్నారు. తరువాత ఆ మనిషి వెళ్ళిపోయినాడు. నేను కొద్దిసేపు అలాగే ఉండిపోయాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో “ఓ ఉమర్! ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు?” అన్నారు. నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుని కి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. దానికి ఆయన “అతడు జిబ్రీల్ అలైహిస్సలాం, మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చినాడు” అన్నారు.

అబూ అబ్దుర్రహ్మాన్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”

ము’ఆద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక ఒక గాడిద పై కూర్చుని ఉన్నాను. ఆ గాడిద పేరు ‘ఉఫెయిర్’. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు “ఓ ము’ఆద్! నీకు తెలుసా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో, అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో?” దానికి నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు. అలాగే అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ కు ఎవరినీ సాటి కల్పించరో, అల్లాహ్ అలాంటి వారిని శిక్షించరాదు.” అన్నారు. నేను “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఈ శుభ వార్తను ప్రజలకు వినిపించవచ్చా?” అని అడిగాను. ఆయన “వారికీ శుభవార్తను వినిపించకు. అలా చేస్తే, వారు కేవలం దీని పైనే ఆధారపడి పోతారు” అన్నారు.

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : (ఒక ప్రయాణములో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్”. దానికి ఆయన “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి “ఓ ముఆధ్!” అన్నారు. ఆయన తిరిగి “మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిరిగి మూడవసారి కూడా అదే విధంగా జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే “సత్యపూర్వకముగా తన సంపూర్ణ హృదయముతో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అన్న ముహమ్మద ర్రసూలుల్లాహ్’ (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు) సాక్ష్యమిస్తాడో, అల్లాహ్ నరకాగ్నిని అతనిపై నిషేధిస్తాడు.” అది విని ముఆధ్ “ఓ రసూలుల్లాహ్! ఈ వార్తను నేను మిగతా వారందరికీ వినిపించనా, వారు సంతోషిస్తారు” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “వద్దు, అలా చేస్తే వారు ఈ ఒక్క దానిపైనే ఆధారపడతారు (అంటే మిగతా సత్కార్యాలు చేయడం పట్ల ఆసక్తి చూపకుండా)” అన్నారు. ముఆధ్ రజియల్లాహు అన్హు తన మరణశయ్యపై ఉండి ఈ హదీసును ఉల్లేఖించినారు – జ్ఞానాన్ని ఇతరులకు చేరవేయకుండా దాచుకున్న పాపమునకు తాను లోను కారాదనే భయంతో.

తారిఖ్ ఇబ్న్ అషీం అల్ అష్జఈ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని ఉచ్ఛరిస్తాడో, మరియు అల్లాహ్ తప్ప ఆరాధించబడే ప్రతిదానినీ నిరసిస్తాడో (అవిశ్వసిస్తాడో), అతని సంపద, మరియు అతని రక్తము (మిగతా విశ్వాసుల కొరకు) హరాం (నిషేధము) అవుతాయి. అతని లెక్క, పత్రము అల్లాహ్ వద్ద ఉంటుంది (అల్లాహ్ చూసుకుంటాడు అని అర్థము).

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు".

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట అన్నారు; దానిపై నేను రెండో మాట అన్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే అల్లాహ్ ను గాక ఇంకెవరినైనా అల్లాహ్ కు సాటి కల్పిస్తూ వేడుకుంటాడో, మరియు ఆ విధానం పైనే మరణిస్తాడో అతడు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు.” మరియు నేను ఇలా అన్నాను “ఎవరైతే అల్లాహ్ ను గాక మరింకెవరినీ వేడుకొనడో అతడు స్వర్గములోనికి ప్రవేశిస్తాడు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ముఆద్ ఇబ్నె జబల్ రజియల్లాహు అన్హు ను యమన్ కు పంపునపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనతో ఇలా అన్నారు: “నిశ్చయంగా నీవు ఇప్పుడు గ్రంథావహులైన జాతి (ప్రజల) వద్దకు వెళుతున్నావు. వారి వద్దకు చేరినపుడు “అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు” అని సాక్ష్యం పలుకమని వారిని ఆహ్వానించు. మరి వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా వారిపై ప్రతి రోజూ ఐదు పూటల నమాజు ఆచరించుటను అల్లాహ్ విధిగా చేసినాడు’ అని. వారు ఆ విషయంలో నిన్ను అనుసరిస్తే, వారికి తెలియజేయి ‘నిశ్చయంగా అల్లాహ్ వారిపై ‘సదాఖా చెల్లించుటను (జకాత్ చెల్లించుటను) విధిగా చేసినాడు’ అని, ‘అది వారిలోని ధనవంతుల నుండి తీసుకోబడుతుంది మరియు వారిలోని పేదవారికి ఇవ్వబడుతుంది’ అని. వారు అందులో కూడా నిన్ను అనుసరించినట్లయితే (ఓ ముఆద్!) వారి సంపదలలోని విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త (జకాతులో భాగంగా వాటిని తీసుకునే ప్రయత్నం చేయకు). అన్యాయానికి, దౌర్జన్యానికి గురైన వాని దువా పట్ల భయపడు. ఎందుకంటే, నిశ్చయంగా వాని ఆక్రందనకూ, అల్లాహ్ కు మధ్య ఎటువంటి అడ్డూ ఉండదు”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను వారిని ఇలా అడిగాను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! తీర్పు దినమునాడు (అల్లాహ్ వద్ద) మీ మధ్యవర్తిత్వం లభించే (మీ సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడెవరు?”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ ఓ అబూ హురైరాహ్! నేను అనుకుంటూనే ఉన్నాను నీ కంటే ముందు ఎవరూ ఈ ప్రశ్న అడుగరు అని నాకు తెలుసు, నీలో హదీసులు నేర్చుకునే ఆశ, ఆసక్తి ఎక్కువ అనీను. తీర్పు దినమునాడు నా మధ్యవర్తిత్వాన్ని పొందే (నా సిఫారసు పొందే) ఆ అదృష్టవంతుడు ఎవరంటే – “లా ఇలాహ ఇల్లల్లాహ్” (నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని ఎవరైతే నిష్కల్మషంగా, హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు".

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”