జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ఇలా అన్నారు: “తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్న...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సర్వోన్నతుడైన అల్లాహ్ వద్ద తన స్థానము ఎంత ఉన్నతమైనదో తెలియ జేస్తున్నారు. (తన పట్ల అల్లాహ్ యొక్క) ప్రేమాభిమాన...
అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను...
(మక్కా విజయం తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను - సజీవులదైనా లేదా నిర్జీవులదైనా (దేవతల) ఏ చిత్రపటాన్ని, శిల్పము, బొమ్మ, ప్రతిమను చూసి...
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవా...
ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శకునములను విశ్వసించుట గురించి హెచ్చరించినారు – అది ఏదైనా విషయం విన్నపుడు గానీ, లేక దేనినైనా చూచినపుడు గానీ ఏ...
ఇమ్రాన్ ఇబ్న్ హుసేన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైన...
ఈ హదీసులో తన ఉమ్మత్’లో కొన్ని పనులు చేసే వాడిని “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు.
మొదటిది: “ఎవరైతే (పక్షిని) ఎగురవేసినాడో లేదా తన కొరకు (...
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి...
ఇస్లాంకు పూర్వ అజ్ఞాన యుగంలో ప్రజలు, అల్లాహ్ ఆదేశం తో నిమిత్తం లేకుండా అంటువ్యాధి దానంతట అదే ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని విశ్వసించేవారు; అల్లాహ...
జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఆయన ఇలా అన్నారు: “తాను చనిపోవడానికి ఐదు రాత్రులకు ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “నేను మీలో నుండి ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకున్నాను అనే విషయం నుండి నన్ను నేను అల్లాహ్ ముందు విముక్తుణ్ణి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగానైతే అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం ను తన ఆప్తమిత్రునిగా (ఖలీల్ గా) తీసుకున్నాడో, నన్ను కూడా అల్లాహ్ తన ఆప్తమిత్రునిగా తీసుకున్నాడు. ఒకవేళ నా సహచర సమాజం (ఉమ్మత్) నుండి నేను ఎవరినైనా నా ఆప్తమిత్రునిగా చేసుకోవాలని అనుకుంటే, నేను అబూబక్ర్ రజియల్లాహు అన్హును నా ఆప్త మిత్రునిగా చేసుకుని ఉండే వాడిని. తస్మాత్, జాగ్రత్త! మీకు పూర్వం గడిచిన తరాల వారు తమ ప్రవక్తల సమాధులను, మరియు సత్పురుషుల సమాధులను మస్జిదులుగా (సజ్దా చేసే స్థలాలుగా) చేసుకునేవారు. ఖబడ్దార్! మీరు సమాధులను మస్జిదులుగా చేసుకోకండి. నేను మిమ్ములను అలా చేయడం నుండి నిషేధిస్తున్నాను”.
అబూ హయ్యాజ్ అల్ అసదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాతో అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను ఏ ఆదేశాలతో ఇక్కడికి పంపినారో, అవే ఆదేశాలతో నిన్ను కూడా పంపనా! ఏ చిత్రపటాన్నైనా, ప్రతిమ, బొమ్మ, శిల్పము మొదలైన వాటిని చెరిపి వేయకుండా, తొలగించకుండా వదలకు, అలాగే ఎత్తుగా నిర్మించిన లేదా ఏదైనా కట్టడం నిర్మించి ఉన్న ఏ సమాధిని కూడా నేలమట్టం చేయకుండా వదలకు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “శకునములను విశ్వసించుట ‘షిర్క్’ (బహుదైవారాధన); శకునములను విశ్వసించుట ‘షిర్క్’; శకునములను విశ్వసించుట ‘షిర్క్’ అని మూడు సార్లు అన్నారు. మరియు మనలో ప్రతి ఒక్కరూ దానిని ఎంతో కొంత అనుభవించిన వారమే; అయితే సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ తనపై ఉంచిన భరోసా ద్వారా దానిని తొలగిస్తాడు.”
ఇమ్రాన్ ఇబ్న్ హుసేన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే శకునాల కొరకు చూస్తాడో లేదా తన కొరకు ఏవైనా శకునాల భావార్థాన్ని (వ్యాఖ్యానాన్ని, తాత్పర్యాన్ని) తెలుసు కోవాలనుకుంటాడో; లేదా ఎవరైతే జోస్యము చెబుతాడో లేదా తన కొరకు జోస్యము చెప్పించుకుంటాడో; లేదా ఎవరైతే చేతబడి చేస్తాడో, లేక చేతబడి చేయిస్తాడో; అలాంటి వాడు మాలోని వాడు కాడు (అతడు ముస్లిం కాడు అని అర్థము). మరియు ఎవరైతే జోస్యుని దగ్గరకు వెళతాడో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తాడో – అలాంటి వాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరించిన దానిని విశ్వసించ లేదు.”
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(అల్లాహ్ అనుమతి లేకుండా వ్యాపించే) ఏ “అద్వా” (అంటువ్యాధి) లేదు, అలాగే ఏ “తియరహ్” (అపశకునము) లేదు; అయితే “అల్ ఫా’ల్” ను (మంచి శకునాన్ని) నేను ఇష్టపడతాను”. ఆయన వద్ద ఉన్న వారు ప్రశ్నించారు “అల్ ఫా’ల్” అంటే ఏమిటి?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఒక మంచి మాట” అన్నారు.”
జైద్ ఇబ్నె ఖాలిద్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి హుదైబియాలో (ఉన్నప్పుడు) రాత్రి వర్షం పడిన తరువాత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఫజ్ర్ నమాజు చదివించినారు. నమాజు ముగిసిన తరువాత ఆయన ప్రజల వైపునకు తిరిగి ఇలా అన్నారు “మీ ప్రభువు ఏమని అన్నాడో తెలుసా?” దానికి వారు “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరునికే తెలుసును” అని జవాబిచ్చారు. దానికి ఆయన “అల్లాహ్ ఇలా అన్నాడు “నా దాసులలో కొంతమంది నన్ను విశ్వసిస్తూ (విశ్వాసులుగా) ఈనాటి ఉదయంలోనికి ప్రవేశించినారు, మరియు మరికొందరు అవిశ్వాసులుగా ప్రవేశించినారు. ఎవరైతే ‘అల్లాహ్ అనుగ్రహం మరియు కరుణ వలన మనపై వర్షం కురిసింది’ అని అన్నారో, వారు నన్ను విశ్వసించినారు మరియు నక్షత్రాలను విశ్వసించలేదు. మరియు ఎవరైతే ‘ఫలాన ఫలాన నక్షత్రాలు ఉదయించడం వలన మనపై వర్షం కురిసింది’ అన్నారో, వారు నన్ను విశ్వసించలేదు, మరియు నక్షత్రాలను విశ్వసించినారు”.
ఉఖబహ్ ఇబ్నె ఆమిర్ అల్ జుహనీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “కొంతమంది ప్రజల సమూహం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చింది. వారిలో ఒక్కరితో తప్ప, తొమ్మిది మందితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతిపై ‘విధేయతా ప్రమాణం’ (బైఅత్) చేయించుకున్నారు. అపుడు వారు ఇలా అన్నారు: “ఓరసూలుల్లాహ్! తొమ్మిది మందితో ప్రమాణం చేయించుకున్నారు, అతడిని వదలివేసారు?” అని. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అతనిఒంటిపై తాయత్తు ఉన్నది” అన్నారు. అతడు తన చేతిని చొక్కా లోనికి పోనిచ్చి, దానిని త్రెంచివేసాడు. తరువాత అతనితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధేయతా ప్రమాణం (బైఅత్) చేయించుకున్నారు. తరువాత ఇలా అన్నారు: “ఎవరైతే తాయత్తును వేలాడదీసుకుంటారో, నిశ్చయంగా అతడు ‘షిర్క్’నకు (బహుదైవారాధనకు) పాల్బడినట్లే.”
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో కొందరు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: (సహీహ్ ముస్లింలోని ఇదే హదీసులో హఫ్సహ్ బింత్ ఉమర్ ఇబ్న్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖించినట్లుగా పేర్కొనబడింది): “ఏదైనా విషయం గురించి ప్రశ్నించడానికి ఎవరైతే జ్యోతిష్కుని వద్దకు వెళతారో మరియు అతడు చెప్పిన దానిని విశ్వసిస్తారో – నలభై దినముల పాటు అతని నమాజులు స్వీకరించబడవు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఒక వ్యక్తి ఇలా అనగా విన్నారు: “కాదు; ఈ కాబా సాక్షిగా” అని. అపుడు ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా అతనితో ఇలా అన్నారు: “అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరునా ప్రమాణం చేయకు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఎవరైతే అల్లాహ్ పేరున గాక మరింకెవరి పేరుతో ప్రమాణం చేస్తారో, నిశ్చయంగా వారు అవిశ్వానికి పాల్బడినట్లే లేదా అల్లాహ్ కు సాటి కల్పించినట్లే”.
అబూ మూసా అల్ అష్’అరీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : నేను, కొంతమంది అష్’అరీ తెగ వారితో కలిసి, “మాకు సవారీ వాహనాలు (ఉదా: ఒంటెలు, గుర్రాలు మొ.) కావాలి” అని కోరుతూ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళినాము. ఆయన “అల్లాహ్ సాక్షిగా! మీరు సవారీ అయి వెళ్ళడానికి నేను ఏమీ ఇవ్వను, మిమ్ములను సవారీ చేయడానికి నావద్ద ఏమీ లేదు” అన్నారు. అల్లాహ్ కోరినంత కాలము మేము ఎదురు చూసాము. అపుడు వారి వద్దకు మూడు ఒంటెలు తీసుకురాబడినాయి. ఆ మూడు ఒంటెలను తీసుకు వెళ్ళమని ఆయన మమ్మల్ని ఆదేశించినారు. మేము వాటిని తీసుకుని వెళ్ళినాము. అపుడు మాలో కొందరు “అల్లాహ్ మనలను అనుగ్రహించడు, మనం రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, మనకు సవారీ సమకూర్చమని కోరినాము. కానీ ఆయన అల్లాహ్ పై ప్రమాణం చేసి మరీ మనకు సవారీ ఇవ్వను అని అన్నారు; కానీ తరువాత ఇచ్చినారు” అన్నారు. అబూ మూసా (రదియల్లాహు అన్హు) ఇంకా ఇలా అన్నారు: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తిరిగి వచ్చి (మా మధ్య) జరిగిన విషయాన్ని వారికి తెలియజేసినాము. దానికి ఆయన ఇలా అన్నారు: “మీకు సవారీలను నేను సమకూర్చలేదు; కానీ అల్లాహ్ సమకూర్చినాడు. అల్లాహ్ సాక్షిగా – అల్లాహ్ దయతలిచినట్లయితే (ఇన్ షా అల్లాహ్) – ఎప్పుడు ప్రమాణం చేసినా, ప్రమాణం చేసిన దాని కంటే మరో విషయం శుభప్రదంగా కనిపిస్తే, నేను ప్రమాణం చేసిన దాని కొరకు పరిహారం చెల్లించి, ఆ శుభప్రదమైన విషయాన్నే ఎన్నుకుంటాను.”
హుదైఫహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ ‘అల్లాహ్ కోరిన విధంగా మరియు ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనకండి; దానికి బదులు ‘అల్లాహ్ కోరిన విధంగా తరువాత ఫలాన ఆయన కోరిన విధంగా’ అని అనండి.”