- కేవలం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పైనే ఆధారపడాలని మరియు అల్లాహ్ తప్ప మరెవరూ మంచిని తీసుకురాలేరని మరియు అల్లాహ్ తప్ప ఎవరూ హానిని నివారించలేరని విశ్వసించాలని తెలియుచున్నది.
- ఇస్లాం లో ‘తియరహ్’ నిషేధించబడింది. తియరహ్ అంటే చెడు సంకేతాలను విశ్వసించడం మరియు దాని ఆధారంగా పనులు చేయకుండా ఉండిపోవడం.
- ‘అల్ ఫా’ల్’ (మంచి శకునం) నిషేధించబడిన ‘తియరహ్’ లో భాగం కాదు. అది సర్వోన్నతుడైన అల్లాహ్’ పై మంచి అపేక్ష కలిగి ఉండేలా చేస్తుంది
- అల్లాహ్ యొక్క పూర్వనిర్దిష్టానికి (ఆయన ఆదేశానికి, అల్ ఖద్ర్ కు) అనుగుణంగానే ప్రతిదీ జరుగుతుంది, ఆయన సర్వశక్తిమంతుడు మరియు ఏ భాగస్వామి లేని ఏకైకుడు.