- శకునాలను విశ్వసించడం ‘షిర్క్’ (బహుదైవారాధన) అవుతుంది; ఎందుకంటే అది మన హృదయాన్ని అల్లాహ్ తో పాటు మరొకరికి లేక మరొక దానికి అనుసంధానం చేస్తుంది.
- తరుచూ మనకు ఎదురయ్యే ముఖ్య విషయాలను (ముఖ్య విషయాల ఙ్ఞానాన్ని – ఉదా: తౌహీద్, షిర్క్ మొ.) హృదయాలలో భద్రపరుచుకోవాలి. దాని ప్రాముఖ్యత ఈ హదీథులో మనకు కనిపిస్తుంది.
- దుశ్శకునము అనే భావన అల్లాహ్ పై సంపూర్ణ భరోసా ఉంచడం (తవక్కుల్) ద్వారా తొలగించబడుతుంది.
- అలాగే ఇందులో ఏకైకుడైన అల్లాహ్ పైనే సంపూర్ణంగా భరోసా ఉంచాలని, పరమ పవిత్రుడైన అల్లాహ్’కు మాత్రమే మన హృదయాలు అనుసంధానమై ఉండాలని ఆదేశం ఉన్నది