అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్క...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు: సమాజంలో ప్రతి ముస్లింకు అతను శ్రద్ధ వహించాల్సిన మరియు విధిగా భరించాల్సిన బాధ్యత...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమా...
ఈ హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన దుఆ అందరికీ వర్తిస్తుంది. ఎవరైతే ముస్లిముల యొక్క వ్యవహారాలలో దేనినైనా నిర్వహించడానికి అధికారము పొం...
తమీమ్ అద్'దారీ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడి...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేసారు – ధర్మము నిష్కల్మషత్వము మరియు నిజాయితీలపై ఆధారపడి ఉంటుంది; అల్లాహ్ ఆదేశించిన విధంగా, సంపూర్ణంగా అచరి...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆ...
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు:{ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్...
అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిన...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నిషేధించిన ప్రతి చెడును, ప్రతి ఒక్కరూ తన సమర్థతను బట్టి ఆపాలి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అతడు ఏదైనా...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ఇంటిలో ఉన్నపుడు, ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఓ అల్లాహ్! నా ఉమ్మత్ కు (సమాజానికి) సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు దాని ద్వారా ప్రజలను కష్టాలకు, కఠిన పరిస్థితులకు గురిచేస్తే, నీవు కూడా అతడిని కాఠిన్యానికి గురి చేయి. మరియు నా ఉమ్మత్ కు సంబంధించిన ఏ విషయములోనైనా ఎవరికైనా అధికారాన్ని ఇచ్చినట్లయితే, అతడు (ప్రజలను కష్టాలపాలు చేయకుండా) ప్రజలతో దయతో, కరుణతో స్నేహపూర్వకంగా ఉన్నట్లయితే, నీవు కూడా అతనిపై కృపతో, దయతో, అనుగ్రహముతో ఉండు”.

తమీమ్ అద్'దారీ రజియల్లాహు అన్హు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ధర్మము ఒక నిష్కల్మషమైన బోధన, ఉపదేశం”. మేము ఇలా అడిగాము: “ఎవరి కొరకు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ కొరకు, ఆయన గ్రంథం (ఖుర్’ఆన్) కొరకు, ఆయన సందేశహరుని కొరకు, ముస్లిముల విద్వాంసుల కొరకు మరియు సాధారణ ముస్లిములందరి కొరకు” అన్నారు.

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు {ఆయన (అల్లాహ్‌)యే నీపై (ఓ ము'హ మ్మద్‌!) ఈ గ్రంథాన్ని (ఖుర్‌ఆన్‌ను) అవతరింప జేశాడు, ఇందులో కొన్ని స్పష్టమైన అర్థమిచ్చే ఆయతులు (ము'హ్‌కమాత్‌) ఉన్నాయి. అవి ఈ గ్రంథానికి మూలాలు. మరికొన్ని అస్పష్టమైనవి (ముతషాబిహాత్‌) ఉన్నాయి కావున తమ హృదయాలలో వక్రత ఉన్నవారు సంక్షోభాన్ని రేకెత్తించటానికి మరియు గూఢార్థాలను ఆపేక్షించి ఎల్లప్పుడూ అస్పష్టమైన వాటి వెంటపడతారు. వాటి అసలు అర్థం అల్లాహ్‌కు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ పరిపక్వ జ్ఞానం గలవారు: ''మేము దీనిని విశ్వసించాము, ప్రతి ఒక్కటీ మా ప్రభువు వద్ద నుండి వచ్చినదే!'' అని అంటారు. జ్ఞానవంతులు తప్ప ఇతరులు వీటిని గ్రహించలేరు.} (సూరహ్ అల్ ఇమ్రాన్ 3:7). ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “(ఆ ఆయతును పఠించిన) తరువాత ఆయన ఇలా అన్నారు: “ కనుక అస్పష్టమైన (ముతషాబిహాత్‌) ఆయతులను అనుసరించే వారిని గనుక నీవు చూసినట్లయితే, అటువంటి వారికి అల్లాహ్ ఒక పేరునిచ్చినాడు (హృదయాలలో వక్రత ఉన్నవారు అని). వారి పట్ల జాగ్రత్తగా ఉండు”.

అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.

అన్’ను’మాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: అల్లాహ్ నిర్దేశించిన హద్దులలో నిలిచి ఉండేవారి, మరియు వాటి లోపలే ఉండిపోయేవారి ఉపమానం ఓడపై (ఎక్కే ముందు పై అంతస్థులో ఎవరు ఉండాలి అని) లాటరీ వేయువాని వంటిది. అలా కొందరు ఓడ పై అంతస్థులో ఉంటారు, కొందరు ఓడ క్రింది అంతస్థులో ఉంటారు. త్రాగు నీటి కొరకు క్రింది అంతస్థులోని వారు పై అంతస్థుకు వెళ్ళినపుడు అక్కడ ఉన్నవారిని దాటుకుంటూ వెళ్ళవలసి వచ్చేది. దానితో వారు (క్రింది అంతస్తు వారు) ఇలా అన్నారు “ఓడలో మనం ఉంటున్న భాగములోనే ఒక రంధ్రము చేస్తే (త్రాగు నీటి కొరకు) మన పై ఉంటున్నవారికి ఇబ్బంది కలిగించము కదా”. ఒకవేళ వారిని (క్రింది అంతస్తు వారిని) వారు కోరిన విధంగా చేయడానికి వదిలేస్తే, అందరూ మునిగిపోతారు. ఒకవేళ దానిని (విషయాన్ని ఆపితే) తమ చేతులలోనికి తీసుకుంటే వారితో పాటు అందరూ రక్షింపబడతారు.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి - దానిని అనుసరించిన వారి పాపములను పోలినంత పాపము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పాపములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు.

అబీ మస్'ఊద్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి "నేను సవారీ చేసి వచ్చిన జంతువు చనిపోయింది. కనుక నాకొక సవారీ జంతువును సమకూర్చండి" అన్నాడు. దానికి ఆయన "నా వద్ద (జంతువు) లేదు" అన్నారు. ఒక వ్యక్తి (లేచి) "ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికైతే ఇతనికి సవారీ జంతువును ఇవ్వగలగే స్తోమత ఉన్నదో, ఇతణ్ణి అతని వద్దకు మార్గదర్శకం చేస్తాను" అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం "ఎవరైతే ఒక మంచి వైపునకు మార్గదర్శకం చేస్తారో, అతనికి ఆ మంచి పనిని ఆచరించిన వానితో సమానంగా ప్రతిఫలం లభిస్తుంది" అన్నారు.

సహ్ల్ బిన్ స’అద్ అస్సఅదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఖైబర్ దినమున రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను రేపు ఈ జెండాను, ఎవరి చేతుల మీదుగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదిస్తాడో, అతనికి ఇస్తాను. అతడు అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడు; అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు అతడిని ప్రేమిస్తారు.” ఆయన (సహ్ల్ బిన్ సఅద్) ఇంకా ఇలా అన్నారు: “తమలో ఎవరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ జెండాను ఇవ్వబోతున్నారో” అని ప్రజలందరూ ఆ రాత్రంతా ఉత్సుకతతో అలాగే గడిపారు. ఉదయం అవుతూనే ప్రజలందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్ళారు, ప్రతి ఒక్కరూ ఆ జెండాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతికే ఇస్తారు అనే ఆశతో. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అలీ ఇబ్న్ అబీ తాలిబ్ ఎక్కడ?” అని అడిగారు. దానికి వారు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ! ఆయన కంటిలో ఏదో సమస్యతో బాధపడుతున్నాడు” అన్నారు. దానికి ఆయన “అయితే అతడిని తీసుకుని రావడానికి ఎవరినైనా పంపండి” అన్నారు. అప్పుడు ఆయనను తీసుకువచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కళ్ళలో ఉమ్మివేసి ఆయన కోసం ప్రార్థించారు. దానితో ఆయన అంతకు ముందు అసలు ఎప్పుడూ నొప్పి లేదు అన్నట్లుగా కోలుకున్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనకు జెండాను ఇచ్చారు. అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “ఓ రసూలల్లాహ్! వారు మనలాగా (విశ్వాసులుగా) మారేంతవరకు పోరాడాలా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “మీరు వారి ప్రాంగణానికి చేరుకునే వరకు స్థిరంగా వెళ్ళండి, ఆపై వారిని ఇస్లాంలోకి ఆహ్వానించండి మరియు అల్లాహ్ యొక్క హక్కులకు సంబంధించి వారిపై ఏ ఏ విషయాలు విధి చేయబడినాయో వారికి తెలియజేయండి. ఎందుకంటే అల్లాహ్ సాక్షిగా, మీ ద్వారా ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సన్మార్గానికి (ఇస్లాం వైపునకు) నడిపిస్తే, అది మీ కొరకు ఎర్రని ఒంటెల కన్నా మేలు” అన్నారు.”

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ ఇలా పలికినారు "ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”

తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతుండగా నేను విన్నాను: “రాత్రింబవళ్ళు ఎక్కడెక్కడి వరకు చేరుకుంటాయో అక్కడి వరకు నిశ్చయంగా ఈ విషయం (ఇస్లాం) చేరుకుంటుంది. అది పల్లె గానీ లేదా పట్టణం గానీ లేదా ఎడారి గానీ, అల్లాహ్ ఏ ఒక్క ఇంటినీ విడిచి పెట్టకుండా ఈ ధర్మాన్ని (ఇస్లాంను) ప్రవేశింపజేస్తాడు; తద్వారా గౌరవనీయులకు గౌరవాన్ని ప్రసాదిస్తూ, అవమానకరమైన వారిని అవమానం పాలు చేస్తూ; ఇక్కడ గౌరవం అంటే ఇస్లాం ద్వారా కలుగజేయబడే గౌరవం; మరియు అవమానం అంటే అవిశ్వాసం ద్వారా కలుగజేయబడే అవమానం.” తమీమ్ అద్దారీ రజియల్లాహు అన్హు ఇలా అంటూ ఉండేవారు: “వాస్తవంలో నా కుటుంబ సభ్యులలోనే ఇలా జరగడం నాకు తెలుసు. వారిలో ఇస్లాం స్వీకరించిన వారికి వాస్తవంగా శుభాలు, గౌరవం మరియు కీర్తి లభించాయి; మరియు వారిలో ఎవరైతే సత్యతిరస్కారులై, అవిశ్వాసులుగా ఉండిపోయారో, వాస్తవములో వారు అధోగతి పాలై, అవమానం పాలై, ‘జిజియా’ చెల్లించే స్థితిలో ఉండిపోయారు.”