- ఈ హదీసులో అలీ రజియల్లాహు అన్హు యొక్క ఘనత, మరియు ఆయనను గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఆయనను అల్లాహ్ మరియు ఆయన సందేశహరుడు ప్రేమిస్తున్నారని, మరియు ఆయన అల్లాహ్’ను మరియు ఆయన సందేశహరుడిని ప్రేమిస్తాడని – చేసిన ప్రకటన, అలీ రజియల్లాహు అన్హు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియ జేస్తున్నాయి
- ఇందులో సత్కార్యాల పట్ల సహాబాల ఆసక్తి, మరియు దాని కోసం వారి మధ్య ఆరోగ్యకరమైన పోటీని చూడవచ్చు.
- అలాగే ఇందులో యుద్ధభూమికి సంబంధించి ప్రవర్తనా నియమాలు, అనవసరంగా ఉద్వేగానికి లోను కాకుండా ఉండడం, మరియు అనవసరమైన శబ్దాలు చేయుట నుండి దూరంగా ఉండడం మొదలైనవి షరియత్’లోని విషయాలే.
- యూదులపై విజయం సాధించబోతున్నామని ముందుగానే భవిష్యవాణి చేయడం, అల్లాహ్ అనుజ్ఞతో అలీ రజియల్లాహు అన్హు కంటి బాధను ఆయన చేతుల మీదుగా పోయేలా చేయడం – ఇవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవక్తత్వానికి నిదర్శనాలు.
- జిహాద్ యొక్క గొప్ప ఉద్దేశ్యము ప్రజలను ఇస్లాం లోనికి తీసుకు రావడమే.
- ఇస్లాం వైపునకు ఆహ్వానించడం అనేది క్రమానుగతంగా జరుగుతుంది. మొదట అవిశ్వాసిని “షహాదతైన్” (రెండు సాక్ష్యపు వాక్యాలు) పఠించి ఇస్లాం లోనికి ప్రవేశించమని కోరడం జరుగుతుంది, ఆ తరువాత అతడు ఇస్లాం యొక్క విధులు నిర్వహించాలని ఆదేశించడం జరుగుతుంది.
- ఇస్లాం వైపునకు ఆహ్వానించడం యొక్క ఘనత, మరియు అది ఆహ్వానించేవానికి, ఆహ్వానించబడిన వానికి తీసుకుని వచ్చే మంచి ఏమిటంటే – ఆహ్వానించబడినవాడు సత్యధర్మం వైపునకు మార్గదర్శనం పొందుతాడు, మరియు ఆహ్వానించువాడు అందుకుగానూ అతి గొప్ప బహుమానం (స్వర్గం) ప్రసాదించబడతాడు.