అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అఖబా’ దినము ఉదయమున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై కూర్చుని (నాతో) “కొన్ని గులక...
ఈ హదీసులో - అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా హజ్జతుల్ విదాలో ‘యౌమున్నహర్’ దినమున (ఖుర్బానీ ఇచ్చే దినమున), జమరాతుల్ అఖబ పై గులకరాళ్ళు విసు...
అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూ...
ఈ హదీసులో – (ధర్మం విషయంలో గానీ లేదా ప్రాపంచిక విషయంలో గానీ) ఇస్లాం విషయంలో హద్దులను ఉల్లంఘించి వ్యవహరించే వారు భంగపాటుకు, వైఫల్యానికి, ఆశాభంగానికీ గు...
అదీ ఇబ్న్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – యూదుల పట్ల అల్లాహ్ ఆగ్రహించినాడని తెలియజేస్తున్నారు; ఎందుకంటే వారు సత్యాన్ని ఎరిగి కూడా దానిపై ఆచరించలేదు....
అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: సృష్ఠితాల భవితవ్యానికి సంబంధించి ఏమి జరుగనున్నది అనేది అల్లాహ్ చాలా విపులంగా రాసాడు;...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అఖబా’ దినము ఉదయమున రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఒంటెపై కూర్చుని (నాతో) “కొన్ని గులకరాళ్ళు ఏరి ఇవ్వు” అన్నారు. నేను ఆయనకు ఏడు గులకరాళ్ళు ఏరి ఇచ్చాను. అవి విసరడానికి అనువుగా ఉన్న గులకరాళ్ళు. వాటిని తన చేతిలో అటూ ఇటూ కదుపుతూ ఆయన ఇలా అన్నారు: “వీటిని పోలిన వాటిని (గులకరాళ్ళను) మీరు (అఖబా పై) విసరండి.” ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ప్రజలారా! ధర్మములో హద్దులు మీరకండి. నిశ్చయంగా ధర్మములో హద్దులు మీరినందుకే మీ పూర్వికులు నాశనం అయినారు.”

అబ్దుల్లాహ్ బిన్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “(ధర్మం విషయంలో) ‘హద్దుమీరేవారు నాశనమయ్యారు”. అలా మూడు సార్లు అన్నారు.

అదీ ఇబ్న్ హాతిం రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “యూదులు అల్లాహ్ ఆగ్రహానికి గురియైన వారు; మరియు క్రైస్తవులు మార్గభ్రష్ఠులైన వారు”

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఆకాశాలనూ మరియు భూమినీ సృష్ఠించడానికి యాభై వేల సంవత్సరాలకు పూర్వమే అల్లాహ్ సృష్టితాలన్నింటి భవితవ్యాన్ని రాసి ఉంచినాడు”. ఆయన ఇంకా ఇలా అన్నారు “ఆయన సింహాసనం నీటిపై ఉన్నది”.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సత్యసంధుడూ, అత్యంత విశ్వసనీయుడూ అయిన రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాతో ఇలా అన్నారు “మీలో ప్రతి ఒక్కరి సృష్టి అతడి తల్లి గర్భములో నలభై దినములు, నలభై రాత్రులు (అతడి శరీరానికి కావలసిన వాటిని) సమీకరించడం ద్వారా జరుగుతుంది. తరువాత అంతే కాలము కొరకు (40 దినముల కొరకు) అతడు ఒక రక్తపు ముద్దలా అవుతాడు. తరువాత అతడు అంతే కాలం కొరకు ఒక మాంసపు ముద్దలా అవుతాడు. అపుడు (అల్లాహ్ తరఫున) ఒక దైవదూత అతని వద్దకు పంపబడతాడు. అతడు నాలుగు విషయాలు రాయుట కొరకు ఆఙ్ఞాపించ బడతాడు; అతడి జీవనోపాధి, అతని జీవనకాలము (అతడు ఎంత కాలం జీవిస్తాడు, ఎప్పుడు మరణిస్తాడు), అతడి ఆచరణలు మరియు అతడు చెడ్డవాడా లేక ధన్యజీవియా అనే విషయాలు. అపుడు అతని లోనికి ఆత్మ ఊదబడుతుంది. మీలో ఎవరైనా స్వర్గవాసుల లక్షణమైన సత్కార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ స్వర్గానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు నరకవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు నరకాగ్ని లోనికి ప్రవేశిస్తాడు. అలాగే మీలో ఎవరైనా నరకవాసుల లక్షణమైన పాపకార్యాలు అంత వరకు చేస్తూ ఉంటాడు, ఎంతవరకూ అంటే అతనికీ నరకానికీ మధ్య కేవలం ఒక మూరెడు దూరం మాత్రమే మిగిలి ఉంటుంది. అపుడు అతడి కొరకు రాయబడినది అతడిని అధిగమిస్తుంది. అపుడు అతడు స్వర్గవాసుల ఆచరణలను ఆచరించడం మొదలు పెడతాడు, మరియు దాని లోనికి ప్రవేశిస్తాడు.

అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నరకము కోరికలు, వ్యామోహముల నడుమ ఉన్నది మరియు స్వర్గము కష్టము, ప్రయాసల నడుమ ఉన్నది”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీ ఈ (ప్రపంచపు) అగ్ని, నరకాగ్ని యొక్క డెభ్భై భాగాలలో ఒకటి.” అది విని మాలో ఒకరు “ఓ రసూలుల్లాహ్! (అవిశ్వాసులను శిక్షించడానికి) ఈ అగ్ని సరిపోతుంది కదా!” అని అడిగారు. దానికి ఆయన “ఈ అగ్ని కంటే నరకాగ్ని ఇంకా అరవై తొమ్మిది భాగాలు ఎక్కువ ఉంటుంది. దాని ప్రతి భాగమూ ఈ అగ్ని అంత వేడిని కలిగి ఉంటుంది” అన్నారు.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచిస్తుండగా నేను విన్నాను: “అల్లాహ్ భూమిని ఒడిసి పట్టుకుంటాడు; ఆకాశాలను చుట్టచుట్టి (దానిని కూడా) తన కుడి చేతిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఇలా అంటాడు “నేనే రారాజును, భూమిపై (రాజరికం చేసిన) రాజులు ఏరీ, ఎక్కడున్నారు?”

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాతృమూర్తి) ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. ఇంటిలో ఒక బీరువా లాంటిది ఉన్నది, దానిపై నేను సన్నని వస్త్రపు తెర లాంటి దానిని వేళాడదీసి ఉంచినాను. దానిపై జీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి. ఆయన దానిని చూస్తూనే చించి వేసారు. ఆయన ముఖము రంగు మారింది. ఆయన “ఓ ఆయిషా! పునరుత్థాన దినాన అల్లాహ్ వద్ద అతి కఠినమైన శిక్ష, సృష్టి కర్తగా (ఆయన చేసే పనిని) ఆయనను అనుకరించే వారికి ఉంటుంది” అన్నారు.” ఆయిషా రజియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు “మేము దానిని ముక్కలుగా చించివేసి దానితో ఒకటో, రెండో తలదిండ్లు తయారు చేసుకున్నాము.”