- ఇందులో, అది ఎంత చిన్నదైనా సరే మంచి చేయమని ప్రోత్సాహము, అలాగే ఎంత చిన్నదైనా సరే చెడును విడనాడాలని, దూరంగా ఉండాలని హెచ్చరిక ఉన్నది.
- ఒక ముస్లింనకు తన జీవితం లో (స్వర్గం పట్ల) ఆశ మరియు (నరకం పట్ల) భయం – ఈ రెంటినీ కలుపుకుని ముందుకు సాగడం మినహా వేరే మార్గం లేదు. అలాగే తన స్థితి (అది మంచిది కానీ, చెడు కానీ) తనను మోసంలో పడవేయకుండా, తాను సంపూర్ణమైన ముస్లింగా మారేటంత వరకు ఎల్లప్పుడూ తనను సత్యంపై నిలకడగా, స్థిరంగా ఉంచమని పరమ పవిత్రుడైన అల్లాహ్ ను వేడుకుంటూ ఉండాలి.