- ఇందులో ప్రపంచ ప్రజలందరికీ సాధారణంగా వర్తించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఉన్నది. ఆ సందేశాన్ని అనుసంరించడం తప్పనిసరి అని, ఆ సందేశముతో వచ్చిన షరియత్ అంతకు ముందు వచ్చిన అన్ని షరియత్ లను రద్దు చేస్తున్నదని తెలియుచున్నది.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించకుండా, అతడు మిగతా అందరూ ప్రవక్తలను (వారందరిపై అల్లాహ్ యొక్క కరుణ వర్షించుగాక) విశ్వసించినప్పటికీ, ఆ విశ్వాసము అతనికి ఏ విధంగానూ ప్రయోజనం కలిగించదు.
- ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను గురించి నిజంగానే ఏమీ వినలేదో, మరియు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం చేరలేదో వారు క్షమించబడతారు. తీర్పు దినము నాడు వారి వ్యవహారము అల్లాహ్ యొక్క ఆధీనములో ఉంటుంది.
- ఒక వ్యక్తి (నరకములో పడకుండా), అతడు మృత్యువుకు సమీపములో ఉన్నా, తీవ్రమైన వ్యాధిగ్రస్తుడై ఉన్నా, అతడి ప్రాణము ఇంకా అతడి గొంతులోనికి చేరే ముందు క్షణము వరకూ – అతడు ఇస్లామును స్వీకరించి, ఆ విధంగా ఇస్లాం ద్వారా ప్రయోజనం పొంది తనను తాను రక్షించుకోగలడు.
- అవిశ్వాసుల ధర్మాలను - అది యూదుల ధర్మమైనా, లేక క్రైస్తవుల ధర్మమైనా, లేక ఇతరుల ఏ ధర్మమైనా – సత్యధర్మాలేనని అంగీకరించడం కూడా అవిశ్వాసానికి (కుఫ్ర్ కు) పాల్బడినట్లే.
- ఈ హాదీసులో యూదులు మరియు క్రైస్తవులు పేర్కొనబడినప్పటికీ, ఇది ప్రతి ఒక్కరికీ వర్తించే హెచ్చరిక. ఎందుకంటే యూదుల వద్ద మరియు క్రైస్తవుల వద్ద అవతరించ బడిన దివ్యగ్రంథాలున్నాయి. అయినప్పటికీ వారు హెచ్చరించబడుతున్నారు అంటే, మరి అవతరించిన ఏ దివ్య గ్రంథమూ లేని వారికీ ఈ హెచ్చరిక ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను విశ్వసించడం, మరియు ఇస్లాం లోనికి ప్రవేశించడం ప్రతి ఒక్కరిపై విధి గావించబడింది.