ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నే...
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ము’ఆద్ (రదియల్లాహు అన్హు) చేతిని పట్టుకుని “అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఓ ముఆద్! నేను నీకు ఉపదేశి...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దా చేసినపుడు దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు అని; అలాగే, దాసుడు అల్లాహ్ కు విధేయత చూపుతూ అణకువతో,...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక దుఆలు చేసేవారు; వాటిలో ఈ దుఆ కూడా ఒకటి: “అల్లాహుమ్మ, రబ్బనా, ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా...
అబూ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా అడిగారు:
“సర్వలోకాల సార్వభౌముడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ వద్ద - మీ ఆచరణలలో అత్య...
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్త...
ముఆద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఒక ప్రయాణంలో ఉన్నాను, మరియు ఒక రోజు మేము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నేను...
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “’సజ్దా’ (సాష్టాంగ ప్రమాణము) చేసినపుడు (ఆ స్థితిలో) దాసుడు తన ప్రభువుకు అతి చేరువగా ఉంటాడు. కనుక ‘సజ్దా’ స్థితిలో మరింత ఎక్కువగా ఆయనను వేడుకొనండి”.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “(మిగతా దుఆల కన్నా) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ ఎక్కువగా పఠించేవారు: “అల్లాహుమ్మ, రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతన్, వ ఫిల్ ఆఖిరతి హసనతన్, వఖినా అజాబన్నార్” (ఓ అల్లాహ్! మా ప్రభువా! ఈ ప్రపంచములో మాకు మంచిని కలుగజేయుము, మరియు పరలోకమునందును మాకు మంచిని కలుగజేయుము, మరియు నరకాగ్ని నుండి మమ్ములను రక్షింపుము.”
అబూ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ ఆచరణలలో ఉత్తమమైన దాని గురించి నేను మీకు తెలుపనా? అవి మీ ప్రభువు వద్ద పరిశుద్ధమైనది; అది మీ స్థానములను ఉన్నతము చేయునటువంటిది; (అల్లాహ్ మార్గములో) బంగారము మరియు వెండి ఖర్చుచేయుట కంటే ఉత్తమమైనది; మరియు మీరు మీ శత్రువులను ఎదుర్కొన్నపుడు వారి మెడలపై మీరు దాడి చేయడం, మరియు వారు మీ మెడలపై దాడి చేయడం కంటే కూడా ఇది మీకు శ్రేష్ఠమైనది”; దానికి వారు “తప్పకుండా తెలియజేయండి ఓ ప్రవక్తా!” అన్నారు. అపుడు ఆయన “సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క స్మరణ చేయుట (ఆయనను స్మరించుట, జిక్ర్ చేయుట)” అన్నారు.
ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రతి రాత్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ఉపక్రమించినపుడు తన రెండు అరచేతులను దగ్గరకు చేర్చి, వాటిలో ఊది, అల్ ఇఖ్లాస్, అల్ ఫలఖ్, అన్’నాస్ సూరాలను (ఖుల్ హువల్లాహు అహద్, ఖుల్ అఊదు బిరబ్బిల్ ఫలఖ్, మరియు ఖుల్ అఊదు బిరబ్బిన్నాస్ సూరాలను) పఠించి, ఆ రెండు అరచేతులతో వీలైనంత మేర శరీర భాగాలను తుడుచుకునే వారు. తన తల, ముఖము, మరియు శరీరపు ముందు భాగము నుండి ప్రారంభించేవారు. అలా మూడు సార్లు చేసేవారు”.
షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు: సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఉదయం అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ బిక అస్బహ్’నా, వబిక అమ్’సైనా, వబిక నహ్యా, వబిక నమూతు, వ ఇలైకన్నుషూర్” సాయంత్రం అయితే ఆయన (స) ఇలా పలికేవారు: “బిక అమ్’సైనా, వబిక అస్బహ్’నా, వబిక నహ్యా, వబిక నమూతు, వైలైకన్నుషూర్”. అబూహురైరహ్ (ర) ఇంకా ఇలా అన్నారు: “ఒక్కోసారి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అనేవారు: “...వ ఇలైకల్ మసీర్”.
(ఓ అల్లాహ్! నీ ద్వారా మేము ఉదయంలోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. ఓ అల్లాహ్! నీ ద్వారా మేము సాయంత్రం లోనికి ప్రవేశించినాము; మరియు నీ ద్వారా మేము ఉదయం లోనికి ప్రవేశించినాము, మరియు నీ ద్వారా మేము జీవిస్తున్నాము మరియు నీ ద్వారా మేము మరణిస్తాము మరియు పునరుత్థానము కూడా నీవైపునకే. (ఒక్కోసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “...అంతిమ గమ్యం కూడా నీ వైపునకే)
అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను (నా తండ్రి) ఉథ్మాన్ ఇబ్న్ అఫ్ఫాన్ (రదియల్లాహు అన్హు) ఇలా పలుకగా విన్నాను: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా విన్నాను: “ఎవరైతే (సాయంత్రం పూట) మూడుసార్లు “బిస్మిల్లా హిల్లదీ లాయదుర్రు మఅస్మిహి షైఉన్, ఫిల్ అర్ది, వలా ఫిస్సమాఇ, వహువస్సమీఉల్ అలీం” (అల్లాహ్ పేరుతో; ఎవరి పేరు ప్రస్తావించబడినపుడైతే, భూమిలోనూ, మరియు ఆకాశాలలోనూ ఉన్న దేదీ హాని కలిగించలేదో; ఆయన అన్నీ వినేవాడు, సర్వఙ్ఞుడు) అని పలుకుతాడో, అతడు ఉదయం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు. మరియు ఎవరైతే ఈ పదాలను ఉదయం పలుకుతాడో, అతడు సాయంత్రం వరకు ఏ ఆకస్మిక హానికి గురికాడు.” (ఇది విని అక్కడే ఉన్న వ్యక్తి, పక్షవాతానికి గురి అయి ఉన్న అబాన్ ఇబ్న్ ఉథ్మాన్ (ర) ను చూడసాగినాడు, దానితో ఆయన అతనితో) “ఎందుకలా చూస్తున్నావు నా వైపు? అల్లాహ్ సాక్షిగా, నేను ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) పట్ల అబద్ధం చెప్పలేదు, అలాగే ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ (ర) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల అబద్ధం చెప్పలేదు. ఏ రోజైతే నాకు ఈ పక్షవాతం వచ్చిందో, ఆ రోజు నేను కోపంలో ఉండి ఈ మాటలు పలుకడం మర్చిపోయాను” అన్నారు.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు కధనం : “ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: “ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.
ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: “అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”
సమురా బిన్ జుందుబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్’కు అత్యంత ఇష్టమైన పదాలు నాలుగు; అవి ‘సుబ్’హానల్లాహ్’ (అల్లాహ్ పరమ పవిత్రుడు), ‘అల్’హందులిల్లాహ్’ (స్తోత్రములన్ని కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందినవి), ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేడు) మరియు ‘అల్లాహు అక్బర్’ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు). అయితే ఇందులో మీరు దేనితోనైనా ప్రారంభించవచ్చు”.