అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి...
సహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస...
అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిమునకు తన తోటి సోదర ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ హక్కులలో మొదటిది, మీపై శాంత...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసి...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయాన్ని స్పష్ట పరిచినారు – అది విశ్వాసులు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అయితే వారు ఒకరినొకరు ప్రేమించనం...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడగడం జరిగింది – ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెం...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు – పాపాలు క్షమించబడుటకు, సురక్షితంగా ఉన్న ఆచరణల గ్రంథాల నుండి ఆ పాపాలు తుడిచి వేయబడుటకు, మ...

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను: “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?”. దానికి సహాబాలందరూ “తప్పనిసరిగా ఓ రసూలుల్లాహ్!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనుకూలంగా లేని పరిస్థితులలోనూ పరిపూర్ణంగా ఉదూను ఆచరించుట; మస్జిదునకు ఎక్కువ అడుగులతో వెళ్ళుట (ప్రతిరోజూ ఐదు నమాజులను మస్జిదులో ఆచరించుట); ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి చూచుట. మరియు అది ‘అర్’రిబాత్’ అనబడుతుంది”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసము యొక్క సరైన మార్గాన్ని ఖచ్చితంగా అనుసరించండి; మరియు దానిపై స్థిరంగా, సాధ్యమైనంత దగ్గరగా ఉండండి. బాగా గుర్తుంచుకోండి, (తీర్పు దినము నాడు) మీలో ఎవరూ కేవలం తన ఆచరణల ఆధారంగా రక్షించబడడు.” దానికి వారు ఇలా అన్నారు: “ఓ రసూలుల్లాహ్! మీరు కూడానా?” దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అవును నేను కూడా, అల్లాహ్ తన కారుణ్యము మరియు అనుగ్రహముతో నన్ను కప్పివేస్తే తప్ప” అన్నారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.

అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.

అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవడు తన కొరకు తాను ఇష్టపడేదే తన సోదరుని కోసం కూడా ఇష్టపడనంతవరకు అతడు నిజమైన విశ్వాసి కాలేడు.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషా రజియల్లాహు అన్హా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏ విషయం లోనైనా సౌమ్యత, దయ, కనికరం కలిగి ఉండటమనేది దానిని మరింత అలంకృతం చేస్తుంది. అలాగే ఏ విషయంలో నుండి అయినా వీటిని తొలిగించి వేస్తే అది లోపభూయిష్టం అవుతుంది.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ’నిశ్చయంగా ధర్మము సులభమైనది’ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి,ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి,అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి.