- ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు – ఈ ప్రాపంచిక జీవితానికీ, పరలోక జీవితానికీ ప్రయోజనకరమైన విషయాలను తెలుసుకోవడం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉండే వారు అని తెలుస్తున్నది.
- ‘సలాం’ చేయుట (శాంతి శుభాకాంక్షలు తెలియజేయడం), ఇతరులకు ఆహారం అందించుట అనే ఆచరణలు ఇస్లాం ధర్మంలో ఉత్తమమైన ఆచరణలు, వాటి ఘనత కారణంగా మరియు ప్రజలకు అన్ని వేళలా వాటి అవసరం కారణంగా మనకు వాటి ఔన్నత్యం తెలుస్తున్నది.
- ఈ రెండు గుణాలు మనలోని కరుణను, మంచితనాన్ని మన మాటల్లోనూ, మన ఆచరణల్లోనూ సమ్మిళితం చేసి చూపిస్తాయి, ఇది ‘ఇహ్’సాన్’ (కరుణ, మంచితనం మొ.) యొక్క అత్యంత పరిపూర్ణమైన రూపం.
- ఈ లక్షణాలు ముస్లింలు ఒకరితో ఒకరు వ్యవహరించే విధానానికి సంబంధించినవి; మరియు ముస్లిములు తమ ప్రభువుతో వ్యవహరించే విధానానికి సంబంధించిన ఇతర లక్షణాలు కూడా ఉన్నాయి.
- ఒకరికొకరు ‘సలాం’ చేయడం (శాంతి శుభాకాంక్షలు తెలియజేయడం), ఒకరికొకరు ముందుగా ‘సలాం’ చేయుట కొరకు యత్నించడం – ఇది కేవలం ముస్లిం సహోదరులకు మాత్రమే ప్రత్యేకమైనది. కనుక ఒక ముస్లిం అవిశ్వాసులకు ముందుగా సలాం చేయరాదు.