- స్వర్గములోనికి ప్రవేశము, కేవలం (ఇస్లాంను) విశ్వసించుట ద్వారానే జరుగుతుంది.
- ముస్లిం యొక్క విశ్వాసములో పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే, అతడు తన స్వయం కొరకు ఏమైతే ఇష్టపడతాడో, తన సహోదరుని కొరకు (తోటి ముస్లిం కొరకు కూడా) దానినే ఇష్టపడినపుడు.
- సలాంను వ్యాపింపజేయుట మరియు ముస్లిములకు దానిని అందజేయుట (సలాం చేయుట) అభిలషనీయమైన ఆచరణ, ఎందుకంటే అది ప్రజల మధ్య శాంతిని, ప్రేమను వ్యాపింపజేస్తుంది.
- సలాం ముస్లిములకు మాత్రమే చేయబడుతుంది, ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో “మీ మధ్య” (సలాం ను వ్యాపింపజేయండి) అని అన్నారు.
- సలాం వ్యాప్తి చేయడం అనేది సమాజములో విభాజనను, వలసలను మరియు శతృత్వాన్ని తొలగిస్తుంది.
- ఇందులో ముస్లిముల మధ్య ప్రేమ ఉండవలసిన విషయపు ప్రాధాన్యత తెలుస్తున్నది. మరియు అది విశ్వాసపు సంపూర్ణతలో ఒక భాగము
- మరొక హదీథులో సలాం యొక్క పూర్తి వాక్యము పేర్కొన బడింది – అది – “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి, వ బరకాతుహు’. అయితే ‘అస్సలాము అలైకుం’ అనడం కూడా సరిపోతుంది.