/ “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”...

“ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”...

అబీ అద్’దర్దా రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన సోదరుని పరోక్షములో అతడి గౌరవాన్ని రక్షిస్తాడో, తీర్పు దినమున అల్లాహ్ అతడి ముఖాన్ని నరకాగ్ని నుండి రక్షిస్తాడు”.

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం పరోక్షములో అతడి గౌరవాన్ని కాపాడే ముస్లిమును గురించి తెలియజేస్తున్నారు. ఆ ముస్లిం పరోక్షములో ఎవరైనా అతడి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటే లేదా అతడి గురించి అపవాదులు ప్రచారం చేస్తూ ఉంటే, అతడు ఆవిధంగా చేస్తున్న వాడిని వారిస్తాడు. తన ముస్లిం సోదరుని గౌరవాన్ని కాపాడుతాడు. అటువంటి వాని నుండి తీర్పు దినము నాడు అల్లాహ్ శిక్షను మరల్చి వేస్తాడు.

Hadeeth benefits

  1. ఒక ముస్లిం పరోక్షములో అతడి గుణగణాలను గురించి చెడుగా మాట్లాడుట నిషేధించబడినది.
  2. అల్లాహ్ నుండి ప్రతిఫలం అతడు చేసిన ఆచరణ ఆధారంగా ఉంటుంది. కనుక ఎవరైతే తన సోదరుని గురించి చెడుగా మాట్లాడడాన్ని అతడి పరోక్షములో ఆపుతాడో, అతడి నుండి అల్లాహ్ శిక్షను త్రిప్పివేస్తాడు.
  3. ఇస్లాం ప్రజలలో సహోదరత్వము, ఐకమత్యము, వారి మధ్య సంఘీభావము పెంపొందించే ధర్మము.