అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించారు – షరియత్ అనుమతించిన పరిధులకు అనుగుణంగా ధర్మానికి సంబంధించిన విషయాలైనా లేక ప్రాపంచిక జీవితానికి సంబంధించ...
అనస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖనం : “(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించ...
ఇందులో ఉమర్ రజియల్లాహు అన్హు: “అవసరం లేకపోయినా, ఎదుటివారిని ఆకట్టుకోవడానికి తాను ఎక్కువ కష్టపడుతున్నట్లుగా ఉద్దేశ్యపూర్వకముగా మాట్లాడుటను, అలాగే అవసరం...
అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తి...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిం కుడి చేతితోనే తినాలని, మరియు కుడి చేతితోనే త్రాగాలని ఆదేశిస్తున్నారు. మరియు ఎడమ చేతితో తినుటను, త్రాగుటను న...
ఉమర్ ఇబ్న్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భో...
ఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హుమా, ప్రవక్త భార్యలలో ఒకరైన ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా యొక్క కుమారుడు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి...
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు – అల్లాహ్ యొక్క ప్రీతి, ఆశీర్వాదాలు పొందే మార్గాలలో ఒకటి – దాసుడు తన ప్రభువు (అల్లాహ్) యొక్క అనుగ్రహాల...

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి”.

అనస్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖనం : “(ఒకసారి) మేము ఉమర్ రజియల్లాహు అన్హు వద్ద ఉన్నాము. అపుడు ఆయన ఇలా అన్నారు “అత్-తకల్లఫి చేయుట నుండి మనలను నిషేధించుట జరిగింది” (అత్-తకల్లుఫ్ التَّكَلُّفِ అంటే ‘ఎవరైనా, తాను నిజంగా అనుభూతి చెందని విషయాన్ని, అనుభూతి చెందినట్లు ఉద్దేశ్యపూర్వకంగా ప్రదర్శించుట)

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “మీలో ఎవరైనా ఒకవేళ తింటే కుడి చేతితోనే తినండి, త్రాగితే కుడి చేతితోనే త్రాగండి, ఎందుకంటే నిశ్చయంగా షైతాను ఎడమ చేతితో తింటాడు మరియు ఎడమ చేతితో త్రాగుతాడు.”

ఉమర్ ఇబ్న్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.

సలమహ్ ఇబ్న్ అల్ అక్వఇ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి” మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.

సహల్ బిన్ ము’ఆజ్ ఇబ్న్ అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఆహారం భుజించిన తరువాత ఎవరైతే “అల్ హందులిల్లాహిల్లదీ అత్’అమనీ హాదా వ రజఖనీహి మిన్ గైరి హౌలిమ్మిన్నీ వలా ఖువ్వహ్” (ప్రశంసలన్నీ ఆ అల్లాహ్ కొరకే శోభిస్తాయి, ఎవరైతే నాలో ఎటువంటి శక్తి, బలమూ లేకపోయినా నాకు ఈ ఆహారాన్ని సమకూర్చినాడో) – అని పలుకుతాడో, అతని పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “అల్లాహ్, (దాసుడు) తన ఆదేశాలను తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను ఏవిధంగానైతే ఇష్టపడతాడో, తాను అనుమతించిన విషయాలను (సౌలభ్యాలను, రాయితీలను) తీసుకొనుటను, వాటిపై ఆచరించుటను కూడా అదే విధంగా ఇష్టపడతాడు”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”.

అబీ సయీద్ అల్ ఖుద్రీ మరియు అబీ హురైరహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.”