/ “అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”

“అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ ఎవరికైతే మంచి చేయాలని తలపోస్తాడో అతడిని బాధలు, కష్టాలు అనుభవించేలా చేస్తాడు”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – అల్లాహ్ ఒకవేళ విశ్వాసులైన తన దాసులలో ఎవరికైనా మంచి చేయాలని తలిస్తే (ముందుగా) వారిని కష్టాల పాలు చేయడం ద్వారా అంటే వారి సంపదలలో నష్టాలు లేదా వారి కుటుంబాలలో కష్టాల ద్వారా వారిని పరీక్షిస్తాడు. ఎందుకంటే, కష్టాలలో ఒక నిజమైన విశ్వాసి, దుఆల ద్వారా (అల్లాహ్ ను వేడుకొనడం ద్వారా) అల్లాహ్ వైపునకు మరలుతాడు. తద్వారా అతడి పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, అతడి స్థానాలు ఉన్నతం అవుతాయి.

Hadeeth benefits

  1. ఒక నిజమైన విశ్వాసి అనేక కష్టాలకు గురిచేయబడతాడని తెలుస్తున్నది.
  2. కష్టాలు, బాధలు అనేవి అల్లాహ్ తరఫు నుండి తన దాసుల కొరకు, అల్లాహ్ తన దాసులను ప్రేమిస్తున్నాడు అనడానికి ఒక నిదర్శనం కావచ్చు. తద్వారా అతడి స్థానము, హోదా ఉన్నతం చేయబడతాయి, అతడి పాపాలు తుడిచి వేయబడతాయి.
  3. ఇందులో కష్టాలు, బాధలు ఎదురైనపుడు బెదిరిపోకుండా, (అల్లాహ్ నందు విశ్వాసముతో) సహనం వహించాలి అనే హితబోధ ఉన్నది.