- ఇందులో ఎవరైతే పచ్చి వెల్లుల్లి, పచ్చి ఉల్లిపాయలు మరియు పచ్చి ఉల్లి ఆకులు తిన్నారో వారు మస్జిదునకు రావడం పట్ల నిషేధాన్ని చూడవచ్చు.
- దేనిని తినడం వల్ల నోటి నుండి దుర్వాసన వస్తుందో అంటే ఆ కారణంగా సలాహ్ కొరకు వచ్చిన ముస్లిములకు బాధ ఇబ్బంది కలుగుతుందో, అటువంటి ప్రతి వస్తువూ ఈ కోవలోనికి చేరుతుంది, ఉదాహరణకు పొగత్రాగుట మరియు పొగాకు, జర్దా నములుట మొదలైనవి.
- వాటి పట్ల అయిష్టానికి కారణం అవి కలిగించే దుర్వాసన. కనుక వాటిని బాగా ఉడక బెట్టడం ద్వారా, లేక బాగా వండడం ద్వారా వాటి నుండి దుర్వాసన కలిగించే లక్షణం తొలగిపోతే అయిష్టత కూడా తొలగిపోతుంది.
- మస్జిదులో జమాఅత్’తో నమాజుకు హాజరు కావలసి ఉన్నవారు వీటిని తిని మస్జిదుకు వెల్లడం ఇష్టమైన చర్య కాదు (మక్రూహ్), కనుక నమాజుకు హాజరు కావలసి ఉన్నవారు వీటిని తినకుండా ఉండాలి. మస్జిదులో నమాజుకు హాజరు కాకుండా ఉండే ఉద్దేశ్యంతో వీటిని తిన్నట్లయితే అది హరాం చర్య అవుతుంది.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీటిని తినడం నుండి దూరంగా ఉన్నారు; అందుకు కారణం అవి తినడం హరాం (నిషేధం) అని కాదు, ఎందుకంటే వారు సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూత అయిన జిబ్రీల్ (అలైహిస్సలాం) తో సంభాషిస్తూ ఉంటారు కనుక.
- ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అద్భుతమైన బోధనా విధానాన్ని గమనించవచ్చు. వారు పచ్చి ఉల్లి, పచ్చి వెల్లుల్లి, పచ్చి ఉల్లి ఆకులు తినరాదు అనే తన తీర్పు వెనుక ఉన్న హేతువును స్పష్ఠం చేయడం ద్వారా వింటున్న వారిలో భరోసాను కలుగజేసారు.
- అల్’ఖాజీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ధర్మ పండితులు ఈ విషయం మస్జిదులకు మాత్రమే కాకుండా ఎక్కడైతే ఇబాదత్ (అరాధన) కొరకు ప్రజలు జమ అవుతారో అటువంటి ప్రదేశాలన్నింటికీ వర్తిస్తుంది అన్నారు, ఉదాహరణకు: ఈద్ ప్రార్థనలు జరిగే స్థలాలు (ఈద్’గాహ్ లు మొ.); మృతుని కొరకు ప్రార్థన జరిగే స్థలాలు (సలాతుల్ జనాయిజ్ జరిగే స్థలాలు) మొదలైన ప్రదేశాలు. అదే విధంగా ఙ్ఞానసముపార్జనకు సంబంధించిన సమావేశాలు జరిగే స్థలాలు; అల్లాహ్ యొక్క ‘దిక్ర్’ (స్మరణ) జరిగే స్థలాలు మొదలైనవి. అయితే మార్కెట్ స్థలాలు, సంతలు మరియు అటువంటి ప్రదేశాలు ఇందులోనికి రావు.
- ఇంకా ధర్మ పండితులు ఇలా అన్నారు: ఎవరైతే పచ్చి వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు పచ్చి ఉల్లి ఆకులు తింటాడో; మస్జిదు ఖాళీగా ఉండి ఎవరూ లేకపోయినప్పటికీ, అతడు మస్జిదులోనికి ప్రవేశించకుండా నిషేధించబడతాడు అనడానికి ఈ హదీథు ఒక నిదర్శనం; ఎందుకంటే మస్జిదు దైవదూతలు ఉండే ప్రదేశం, వారి నివాస స్థలం. మరియు ఈ హదీథు ఉన్న సందేశం యొక్క సాధారణత్వం కూడా మరొక కారణం.