/ “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుం...

“ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుం...

సలమహ్ ఇబ్న్ అల్ అక్వఇ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఎడమ చేతితో తినసాగాడు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “కుడిచేతితో తిను”. దానికి అతడు “నేను అలా చేయలేను” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు అలా చేయకుండానే ఉండిపోవుదువుగాక” అన్నారు. వాస్తవానికి అతడు అహంకారం కొద్దీ నిరాకరించినాడు. (అతణ్ణి గురించి) ఇలా అన్నారు: “ఆ తరువాత అతడు తన కుడి చేతిని ఎప్పుడూ నోటి వరకు ఎత్తలేక పొయినాడు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఒక వ్యక్తి ఎడమ చేతితో తినడం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినారు. అందుకని అతడిని కుడి చేతితో తినమని ఆదేశించినారు. ఆ వ్యక్తి అహంకారం కొద్దీ అలా చేయలేనని అబద్ధం చెప్పాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడు కుడి చేతితో తినడం నిషేధమైపోయేలా దుఆ చేసారు. అతడి కుడి చేతికి పక్షవాతం వచ్చేలా చేసి, అల్లాహ్ ఆయన దుఆను స్వీకరించాడు.

Hadeeth benefits

  1. ఈ హదీసు ద్వారా తినడం అనేది తప్పనిసరిగా కుడి చేతితో మాత్రమే చేయాలని మరియు ఎడమ చేతితో తినడం నిషేధమని తెలుస్తున్నది.
  2. షరియత్ ఆదేశాలను అమలు చేయడంలో అహంకారం ప్రదర్శించడం శిక్షార్హము అని తెలుస్తున్నది.
  3. ఇందులో – అల్లాహ్ తన సందేశహరుడైన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దుఆను వెంటనే ఆమోదించి ఆయనకు ఘనతనొసంగడం చూస్తాము.
  4. అలాగే ఇందులో షరియత్ ప్రకారం - చివరికి బోజనం తినే విషయంలో నైనా సరే - మంచిని చేయమని ఆదేశించడం మరియు చెడును నిరోధించడం చేస్తూ ఉండాలని తెలియుచున్నది.