అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మక్కా విజయ దినమున (ఫతహ్ మక్కా దినాన) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ఇలా...
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విజయదినమున ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు: ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి అఙ్ఞానకాలపు అహంకారాన్న...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజల...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ప్రజలలో ఎవరైతే ఏదైనా విషయంపై విపరీత స్థాయిలో జగడానికి దిగుతాడో లేక ఎక్కువగా అలాంటి జగడా...
అబీ బక్రత రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను: “ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు, ‘ఎదుటి వాడిని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో ఇద్దరు ముస్లిములు కత్తులతో ఒకరిపై నొకరు దాడ...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడ...
ముస్లిములను భయపెట్టడానికి లేదా వారిని దోచుకోవడానికి, వారికి నష్టం కలిగించడానికి ఎవరైతే ఆయుధాలను ఎత్తుతారో వారికి వ్యతిరేకంగా ఈ హదీథులో ప్రవక్త సల్లల్ల...
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడరాదని, వారి గౌరవానికి భంగం కలిగించరాదని వివరిస్తున్నారు. అలా చేయడం నైతిక వ...

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మక్కా విజయ దినమున (ఫతహ్ మక్కా దినాన) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు. కాబట్టి, ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు: అల్లాహ్ దృష్టిలో నీతిమంతుడు, పవిత్రుడు మరియు గౌరవప్రదమైన వ్యక్తి మరియు అల్లాహ్ దృష్టిలో దుర్మార్గుడు, దయనీయమైన మరియు అల్పమైన వ్యక్తి. ప్రజలు ఆదము యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదమును మట్టి నుండి సృష్టించాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, అల్లాహ్ ఎక్కువగా అసహ్యించుకునే వాడు ఎవరంటే, ఎవరైతే (ప్రజలతో) విపరీతంగా జగడాలు, కలహాలు పెట్టుకుంటాడో.”

అబీ బక్రత రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రస్తావిస్తుండగా నేను విన్నాను: “ఇద్దరు ముస్లిములు, కత్తులు దూసి ఒకరిపై నొకరు దాడికి దిగితే, వారిలో చంపిన వాడూ మరియు చనిపోయిన వాడూ ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు”. అది విని నేను “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం ! చంపిన వాడి కొరకు అది సరియైనదే, మరి చనిపోయినవాడి గురించి ఎలా?” అని ప్రశ్నించాను. దానికి వారు “అవకాశం దొరికితే తన తోటి వాడిని చంపాలనే అతడు ఆశించినాడు”.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".

అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".

సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”.

అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు పన్నెండు యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన ఇలా ఉల్లేఖిస్తునారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను నాలుగు విషయాలు విన్నాను. అవి నాకు బాగా నచ్చాయి: “ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”

ఉసామా ఇబ్న్ జైద్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీల కంటే ఎక్కువగా మగవారికి హాని కలగజేసే ఏ ‘ఫిత్నా’ (ఏ పరీక్షా, ఏ విపత్తూ) నేను నా వెనుక వదిలి వెళ్ళుట లేదు”.

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షములో ఉన్నాము. అప్పుడు ఆయన ఇలా పలికినారు: “మీలో వివాహం చేసుకోగల స్థోమత కలిగిన వారు వివాహం చేసుకోవాలి. ఎందుకంటే (ఇది ఇతర మహిళలను చూడకుండా) చూపులను నిగ్రహిస్తుంది, మరియు (చట్టవిరుద్ధమైన లైంగిక సంబంధాలలో పడకుండా) మర్మాంగాలను రక్షిస్తుంది. మరియు ఎవరైనా అలా చేయలేకపోతే (వివాహం చేసుకునే స్థోమత లేకపోయినట్లైతే), అతడు ఉపవాసం ఉండాలి, ఎందుకంటే అది అతనికి రక్షణగా ఉంటుంది.”

అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీలు సంతతిలో అరాచకత్వం ప్రబలడానికి వారి స్త్రీ లాలసే మొదటి కారణం అయినది.”

ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ఉఖ్బహ్ ఇబ్న్ ఆమిర్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు వారిని కలవడం నుండి జాగ్రత్తగా ఉండండి”. అది విని అన్సారులలో నుండి ఒక వ్యక్తి “మరి “హమ్’వ” (భర్త తరఫు పురుష బంధువు) ను గురించి మీరు ఏమంటారు?” అని ప్రశ్నించాడు. దానిని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “హమ్’వ” అంటే మరణమే” అన్నారు.