- ‘మహ్రం’ వెంట లేకుండా ప్రయాణించుట (షరియత్’లో) స్త్రీలకు అనుమతించబడలేదు.
- ప్రయాణములో ఒక స్త్రీ మరొక స్త్రీకి మహ్రమ్ కాదు; ఎందుకంటే ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఆమె భర్త లేక మహ్రమ్” అని పేర్కొన్నారు.
- ప్రయాణం అని పిలవబడే ప్రతిదీ భర్త లేదా మహరమ్ వ్యక్తి వెంట లేని స్త్రీ కొరకు నిషేధించబడింది; మరియు ఈ హదీసును ప్రశ్నించేవారి పరిస్థితి మరియు వారి నివాస స్థలం పరిస్థితుల నేపధ్యములో అర్థం చేసుకోవలసి ఉంటుంది.
- ఒక స్త్రీ యొక్క మహ్రమ్ ఎవరు అంటే: ఆమె భర్త, లేదా ఆమెతో ఉన్న బంధుత్వము కారణంగా ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడిన పురుషుడు; అంటే ఉదాహరణకు ఆమె తండ్రి, ఆమె కొడుకు, తండ్రి సహోదరులు (చిన్నాన్న, పెదనాన్న మొ.), మరియు తల్లి సహోదరులు (మేన మామలు); లేదా తన చనుబాలు త్రాపించిన పెంపుడు తల్లి ద్వారా బంధువులు అయిన వారు ఉదా: ఆమె భర్త (పెంపుడు పాల తండ్రి) మరియు పెంపుడు పాల తండ్రి వైపున ఆయన సోదరులు; లేదా వివాహము ద్వారా బంధువులైన పురుషులు, ఉదాహరణకు: భర్త తండ్రి (మామ). మహ్రమ్ ముస్లిం అయి ఉండాలి, యుక్త వయస్కుడు అయి ఉండాలి, మతిస్థిమితము గలవాడై ఉండాలి, మరియు నమ్మదగినవాడై ఉండాలి. ఎందుకంటే ఒక మహ్రమ్ తన వెంట ఉన్న స్త్రీని రక్షించాలని, ఆమెను సురక్షితంగా ఉంచాలని మరియు ఆమెను శ్రధ్ధగా చూసుకోవాలని ఆశించడం జరుగుతుంది.
- ఇస్లామిక్ షరియహ్ స్త్రీల రక్షణ, వారి సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తుంది.
- ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల తరువాత నఫీల్ నమాజులు ఆచరించుట నిషేధించబడినది. అయితే ఈ నియమము సమయానికి ఆచరించలేకపోయిన ఫర్జ్ నమాజులకు, ఏదైనా హేతువు ఉన్న కారణంగా స్వచ్ఛందంగా ఆచరించవలసి వచ్చే నమాజులకు వర్తించదు, అంటే ఉదాహరణకు: తహియ్యతుల్ మస్జిద్ నమాజు మొదలైనవి;
- సూర్యుడు ఉదయిస్తూ ఉండగా నమాజు ఆచరించుట హరాం (నిషేధము). అలాకాక సూర్యుడు పూర్తిగా ఉదయించిన తరువాత, అంటే ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించిన తరువాత ఆచరించవచ్చును, దానికి సూర్యుడు ఉదయించుట మొదలైనప్పటి నుండి పది నిమిషాలు లేక ఒక పావుగంట సమయం పడుతుంది.
- అస్ర్ సమయం సూర్యుడు అస్తమించే వరకు ఉంటుంది.
- ఇందులో మూడు మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణమై వెళ్ళవచ్చును అనే అనుమతి ఉన్నది.
- అలాగే మిగతా మస్జిదుల కంటే, ఈ మూడు మస్జిదుల ఘనత మరియు వాటిని దర్శించడం వలన కలిగే ప్రయోజనాలు తెలుస్తున్నాయి.
- సమాధులను సందర్శించడానికి ప్రయాణించడం అనుమతించబడలేదు; అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి అయినా సరే. అయితే మదీనా వాసులకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడానికి అనుమతి ఉన్నది, అలాగే షరియత్ అనుమతించిన ఏదైనా ప్రయోజనం కొరకు అక్కడికి (మదీనాకు) ప్రయాణించి వచ్చిన వారికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధిని సందర్శించడానికి అనుమతి ఉన్నది.