- ఎవరైనా తన మనసులో ఏదైనా తప్పు లేదా పాపపు పని చేయాలని నిర్ణయించుకుని, దానికి అవసరమైన వనరులు సమకూర్చుకున్నట్లయితే, అటువంటి వారు కఠినమైన శిక్షకు పాత్రులు అవుతారు.
- ఇందులో ముస్లిములు, ముస్లిములపై జగడానికి, దాడికి దిగరాదని కఠినమైన మందలింపు ఉన్నది, నరకాగ్నిలో వేయబడతారు అనే తీవ్రమైన హెచ్చరికా ఉన్నది.
- అయితే షరియత్ ప్రకారం ఒక సత్యమైన హక్కు కొరకు లేదా ఒక సత్యమైన విషయం కొరకు, ఒక ముస్లింతో చేసే యుద్ధం, జగడం మొదలైనవి ఈ హెచ్చరిక క్రిందకు రాదు, ఉదాహరణకు క్రూరుడు, దౌర్జన్యపరుడు అయిన వానికి వ్యతిరేకంగా లేదా సమాజములో చెడును, అశాంతిని వ్యాపింపజేసే వానికి వ్యతిరేకంగా చేసే యుధ్ధము, దాడి మొదలైనవి.
- ‘ఘోరమైన పాపములుగా’ పరిగణించబడే పాపాలలో దేనికైనా పాల్బడే వాడు ‘కాఫిర్’గా (అవిశ్వాసిగా) మారిపోడు. ఎందుకంటే (ఈ హదీసులో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరినొకరు చంపుకోవడానికి దిగిన ఇద్దరినీ ‘ముస్లిములు’ అనే పేర్కొన్నారు.
- కత్తులతో గాక ఇంకే విధంగా నైనా సరే ఇద్దరు ముస్లిములు ఒకరిపై ఒకరు దాడికి దిగితే, అందులో ఒకరు మరొకరిని చంపితే, చంపిన వాడు మరియు చనిపోయిన వాడు, ఇద్దరూ నరకాగ్నిలో వేయబడతారు. ఈ హదీసులో పేర్కొనబడిన ‘కత్తి’ లేక ‘కరవాలము’ అనేది దానికి దారితీసే వనరులలో ఒకదానికి ఉదాహరణ.