/ “ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”...

“ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”...

సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే తన రెండు దవడల మధ్య ఉన్న దాని విషయంలోనూ మరియు తన రెండు తొడల మధ్య ఉన్న దాని విషయంలోనూ నాకు హామీ ఇస్తారో, అతనికి నేను స్వర్గం యొక్క హామీ ఇస్తున్నాను”.
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు విషయాలను గురించి తెలియజేస్తున్నారు – ఒక ముస్లిం, ఒకవేళ ఈ రెండు విషయాల పట్ల తనను తాను కట్టడి చేసుకున్నట్లయితే, అతడు స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు అని. మొదటిది: అల్లాహ్ ఆగ్రహానికి గురి చేసే మాటలు పలకడం నుంచి నాలుకను కట్టడి చేసుకోవడం. రెండవది: అశ్లీలతకు పాల్బడుట నుండి తన మర్మాంగాలను రక్షించుకోవడం. ఎందుకంటే, పాపకార్యాలు ఎక్కువగా ఈ రెండు అంగాల కారణంగానే జరుగుతాయి.

Hadeeth benefits

  1. నాలుక మరియు మర్మాంగాల పవిత్రతను కాపాడుకోవడం స్వర్గంలో ప్రవేశించడానికి ఒక మార్గమని తెలుస్తున్నది.
  2. ప్రత్యేకించి నాలుక మరియు మర్మాంగాలు, (వాటి పవిత్రతను కాపాడుకోకపోతే) అవి మనిషిని ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ అత్యంత బాధాకరమైన శిక్షకు గురిచేసే మూలకారణాలలో ఒకటి అవుతాయని తెలుస్తున్నది.