- ఇందులో తోటి ముస్లిముపై ఆయుధాలను ఎత్తే ముస్లిమునకు వ్యతిరేకంగా కఠినమైన హెచ్చరిక ఉన్నది.
- ఈ భూమిపై అత్యంత హేయమైన పని ముస్లిములపై తోటి ముస్లిం ఆయుధాలను ఎత్తడం, అరాచకాన్ని ప్రబలింప జేయడం, మరియు వారిని చంపడం.
- ఈ హదీసులో పేర్కొనబడిన హెచ్చరిక నిజానికి తోటి ముస్లిములపై ఆయుధాలను ఎత్తడం మాత్రమే కాక, ముస్లిములలో ఉండే చెడ్డవారు, అరాచకానికి పాల్బడేవారు, అన్యానికి, అవినీతికి పాల్బడేవారు – ఈ అందరికీ వర్తిస్తుంది.
- సరదాకైనా తోటి ముస్లిములను ఆయుధాలతో బెదిరించడం, మరింకే విధంగానైనా వారికి కష్టం కలిగించడం ఇస్లాంలో నిషేధించబడినది.