- కోపం కారణంగా మూడు దినములు లేదా అంతకంటే తక్కువ దూరంగా ఉండి పోవడం అనేది మానవ నైజాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయించబడినది. కనుక మూడు దినములు దూరంగా ఉండుట క్షమించబడింది. ఎందుకంటే మూడు దినముల లోపల ఆ కోపపు ఛాయలు దూరమై పోతాయి.
- ఇందులో శాంతి స్థాపన యొక్క ఘనత కనిపిస్తున్నది. శాంతి స్థాపన హృదయాలలో ఉన్న కల్మషాన్ని దూరం చేస్తుంది. అది ప్రేమ, అభిమానముల చిహ్నము
- ప్రజలమధ్య సౌభ్రాతృత్వము మరియు దగ్గరితనములను పెంచే ధర్మము ఇస్లాం ధర్మము.