/ చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు

చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడకండి. ఎందుకంటే వారి ఆచరణల ఫలాలను వారు పొందినారు".
దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం చనిపోయిన వారి పట్ల చెడుగా మాట్లాడరాదని, వారి గౌరవానికి భంగం కలిగించరాదని వివరిస్తున్నారు. అలా చేయడం నైతిక విలువల అధమ స్థాయిని సూచిస్తుంది. ఎందుకంటే చనిపోయిన వారు తమ సత్కర్మల లేక దుష్కర్మల ఫలాన్ని పొందడానికి వెళ్ళిపోయినారు. వారి పట్ల చెడుగా మాట్లాడుట, వారి గౌరవానికి భంగం కలిగే రీతిలో మాట్లాడుట వారిని చేరదు, కానీ బ్రతికి ఉన్నవారిని బాధిస్తుంది.

Hadeeth benefits

  1. చనిపోయిన వారిని శాపనార్థాలు పెట్టుట 'హరాం' (నిషేధం) అని చెప్పడానికి ఈ హదీసు ఒక సాక్ష్యం.
  2. బ్రతికి ఉన్నవారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, చనిపోయిన వారి పట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని వదిలి వేయడం, గొడవలు, వైషమ్యాలు పెరుగకుండా చేస్తుంది. తద్వారా సమాజలో శాంతి, సౌభ్రాతృత్వాలు భంగపడకుండా ఉంటాయి.
  3. చనిపోయిన వారిపట్ల అవమానకరంగా మాట్లాడడాన్ని నిషేధించడం వెనుక వివేకం ఏమిటంటే, చనిపోయిన వారు తమ ఆచరణల ఫలాన్ని పొందడానికి వెళ్ళిపోయినారు. కనుక వారిని తిట్టడం, అవమానకరంగా మాట్లాడడం ఒక వృధా విషయం. అది వారిని ఏ విధంగానూ చేరదు, ఏ విధంగానూ ప్రభావితం చేయదు. పైగా బ్రతికున్న బంధువులను బాధ పెడుతుంది.
  4. ఇందులో, ఎవరైన సరే ప్రయోజనం ఏమీ కలిగించని మాటలను మాట్లాడరాదు అనే హితబోధ ఉన్నది.