అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియ జేస్తున్నారు. ‘ఎవరైతే ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహ...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ఘనమైన రెండు వచనాల గురించి తెలియజేస్తున్నారు. ఆ రెండు వచనాలను మనిషి ఎటువంటి కష్టము లేకుండా, (ఉదయమూ, రా...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకూ, కొరతలకు అతీతుడు, మరియు సకల...
అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది),...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాలు తెలియజేస్తున్నారు: భౌతిక పరిశుద్ధత వుదూ మరియు గుసుల్ ఆచరించుట ద్వారా లభించును. నమాజు కొరకు వుదూ చ...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: మహోన్నతుడైన అల్లాహ్’ను ఈ పదములతో స్మరించుట, ఆయనను స్తుతించుట, ఈ ప్రపంచము కంటే, ఈ ప్రపంచములోని వ...

అబూ అయ్యూబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : "ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే పది సార్లు ‘లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్’ (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, ఈ సృష్టి సామ్రాజ్యమంతా ఆయనకు చెందినదే, సకల స్త్రోత్రములూ ఆయనకు మాత్రమే చెందినవి, మరియు ఆయన ప్రతి విషయము పై అధికారము కలవాడు) అని ఉచ్ఛరిస్తాడో, అతడు ఇస్మాయీల్ అలైహిస్సలాం సంతతి నుండి నలుగురు బానిసలను విముక్తి కలిగించిన వానితో సమానము”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “రెండు వచనాలున్నాయి - అవి (పలుకుటలో) నాలుకపై తేలికైనవి, సత్కర్మల త్రాసులో భారమైనవి మరియు అనంత కరుణామయునికి అత్యంత ప్రియమైనవి. అవి ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు మరియు అన్ని రకాల స్తోత్రములు, ప్రశంసలు కేవలం ఆయన కొరకే శోభిస్తాయి); మరియు ‘సుబ్’హానల్లాహిల్ అజీం’ (మహోన్నతుడైన అల్లాహ్ పరమపవిత్రుడు, లోపములకు అతీతుడు).

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు నేరుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి, వారు ఇలా పలికారని ఉల్లేఖిస్తున్నారు: “ఎవరైతే ‘సుబ్’హానల్లాహి వ బిహందిహి’ (అల్లాహ్ సకల లోపాలకు, కొరతలకు అతీతుడు, మరియు సకల స్తోత్రములు ఆయన కొరకే) అని వంద సార్లు ఉచ్ఛరిస్తాడో, అతని పాపాలు అతని నుండి దించి వేయబడతాయి (తుడిచి వేయబడతాయి) అవి సముద్రపు నురగ అంత ఎక్కువగా ఉన్నప్పటికీ”.

అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నేను ‘సుబ్’హానల్లాహి, వల్ హందులిల్లాహి, వలా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్’ అని పలకడం, సూర్యుడు ఉదయించే వాటన్నింటి కంటే కూడా నాకు అత్యంత ప్రియమైనది. (అంటే వేటివేటిపైనైతే సూర్యోదయం అవుతుందో, ఆ విషయాలన్నింటి కంటే కూడా అత్యంత ప్రియమైనదని భావము).”

జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: ‘జిక్ర్’ లలో (అల్లాహ్’ను ధ్యానించు విషయాలలో) అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, కేవలం అల్లాహ్ తప్ప) అని పలుకుట మరియు దుఆలలో అత్యుత్తమమైనది “అల్-హందులిల్లాహ్” (సకల స్తోత్రములు కేవలం అల్లాహ్ కొరకే) అని పలుకుట”.

ఖౌలహ్ బింత్ హకీం అస్సులమియ్యహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.

అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను. “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”