- ఇంటిలో ప్రవేశించడానికి ముందు మరియు ఆహారం తినుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరు స్మరించుట అనేది అత్యంత అభిలషణీయమైన ఆచరణాలలో ఒకటి. సర్వోన్నతుడైన అల్లాహ్ పేరును స్మరించకపోతే షైతాను ఆ ఇళ్ళలో రాత్రి గడుపుతాడు ఆ ఇళ్ళలో నివసించే వారి ఆహారాన్ని తింటాడు.
- ఆదాము కుమారుని ఆచరణలను, అతని వ్యవహారాలను, అతని ప్రవర్తనను షైతాను గమనిస్తూ ఉంటాడు. ఒకవేళ అతడు అల్లాహ్ ను స్మరించుటలో అలసత్వం వహిస్తే, లేక అల్లాహ్ ను స్మరించే విషయం లో అతడు అజాగ్రత్తలో పడిపోతే, షైతాను అతడి నుండి తనకు కావలసినది ఏమిటో రాబట్టుకుంటాడు.
- కనుక అల్లాహ్ యొక్క స్మరణ షైతాన్’ను పారద్రోలుతుంది.
- ప్రతి షైతానుకు అనుయాయులున్నారు, సహాయకులు ఉన్నారు. వారు అతడి (షైతాను యొక్క) మాటలను, వార్తలను, ఆదేశాలను సంతోషంతో వింటారు, మరియు అనుసరిస్తారు.