/ “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత ...

“ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత ...

ఖౌలహ్ బింత్ హకీం అస్సులమియ్యహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఎవరైనా ఏదైనా ప్రదేశములో ఆగినపుడు, “అఊజు బి కలిమాతిల్లాహి త్తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్” (నేను అల్లాహ్ యొక్క పరిపూర్ణ వాక్కుల ద్వారా ఆయన సృష్టించిన వాటి కీడు నుండి ఆయన శరణు కోరుతున్నాను) అని పలికినట్లయితే, అతడు ఆ ప్రదేశము నుండి వెడలి పోనంత వరకు అతనికి ఏదీ (ఏ విషయమూ) హాని కలిగించజాలదు”.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను - మనిషి భూమిపై ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా అతడు విరామం కోసం ఆగితే, తనకు కీడు జరుగుతుందని భయపడే ప్రతి విషయము నుండి, ఆ కీడును పారద్రోలే ఉత్తమమైన రక్షణ, ఉత్తమమైన శరణు వైపునకు మార్గదర్శకత్వం చేస్తున్నారు – అది ఏదైనా ప్రయాణములో ఎక్కడైనా ఆగడం కావచ్చు లేదా ఏదైనా ప్రదేశానికి విహార యాత్రగా వెళ్ళి ఉండవచ్చు లేదా మరింకేదైనా ప్రయాణం కావచ్చు; అతడు అల్లాహ్ యొక్క ఎటువంటి లోపము, ఎటువంటి దోషము, కొరత (తక్కువదనం) లేని వాక్కుల ద్వారా, ఆ వాక్కుల ఘనత ద్వారా, వాటి శుభాల ద్వారా, వాటి అమితమైన ప్రయోజనం ద్వారా – కీడు కలిగిన ఉన్న సృష్ఠితాల ప్రతి కీడు నుండి, అతనికి హాని కలిగించే ప్రతి విషయము నుండి, అతడు ఆ ప్రదేశములో ఆగినంత కాలము, అతడు ఆ ప్రదేశమునుండి పూర్తిగా వెడలిపోనంత వరకు క్షేమంగా ఉండేందుకు గాను అల్లాహ్ యొక్క రక్షణ, ఆయన శరణు కొరకు వేడుకోవాలి.

Hadeeth benefits

  1. శరణు వేడుకొనుట అనేది కూడా ఒక ఆరాధనే - సర్వ శక్తి మంతుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఏ పేర్లు లేక ఆయన యొక్క ఏ గుణగణాలతో వేడుకుంటున్నామనే దాని గురించి కాదు.
  2. అల్లాహ్ యొక్క వాక్కు ద్వారా ఆయన శరణు వేడుకొనుట అనుమతించబడిన విషయమే; ఎందుకంటే అది (అల్లాహ్ యొక్క వాక్కు) ఆయన శుభలక్షణాలు, గుణగణాలకు (అస్సిఫాత్ నకు) సంబంధించిన విషయము. అది మిగతా సృష్ఠితాల వలే ఒక సృష్ఠితము (సృష్టించబడినది) కాదు. కనుక అల్లాహ్ యొక్క వాక్కు ద్వారా శరణు వేడుకొనుట అనేది, సృష్ఠితాలను శరణు వేడుకొనుట వంటిది కాదు; సృష్ఠితాలను శరణు వేడుకొనుట షిర్క్ అవుతుంది.
  3. ఇందులో వేడుకోలు (అల్లాహ్ ను వేడుకొనుట) యొక్క ఘనత మరియు అందులోని శుభాల గురించి తెలుస్తున్నది.
  4. అల్లాహ్ యొక్క ధ్యానము మరియు ఆయన్ను వేడుకొనుట ద్వారా దాసుడు తన చుట్టూ ఒక రక్షణ కోట నిర్మించుకొనుట అనేది చెడు, కీడు మరియు హాని మొదలైన వాటి నుండి తనను తాను రక్షించుకునే మార్గాలలో ఒకటి.
  5. అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ ను గాక మరింకెవరినైనా, అంటే ఉదాహరణకు జిన్నులు, మాంత్రికులు, బాబాలు మొదలైన వారిని వేడుకొనుట, వారి శరణు అర్థించుట అనేది చెల్లదు.
  6. అలా గాక ఇంటి వద్ద ఉన్నవారిని లేక ప్రయాణములో ఉన్న వారిని మన కొరకు (అల్లాహ్ ను) ప్రార్థించమని (దుఆ చేయమని) కోరుట సమంజసమే.