- ఈ ప్రతిఫలం (పారితోషికం) ఎవరైతే, క్రమం తప్పకుండా ఉచ్ఛరిస్తాడో, లేక ప్రతిరోజూ ఉచ్ఛరిస్తాడో అతనికి దొరుకుతుంది.
- తస్బీహ్ (సుబ్’హానల్లాహ్): అంటే అల్లాహ్ ఎటువంటి అసంపూర్ణత, కొరత మరియు లోపమూ లేనివాడు, పవి త్రుడు, పరిశుద్ధుడు అని అర్థము.
- అల్’హంద్: అల్లాహ్ పై ప్రేమ మరియు భయభక్తులతో ఆయన సంపూర్ణతను, కీర్తిని యశస్సును కొనియాడుట.
- ఈ హదీసులో చెప్పబడినట్లు క్షమించ బడేవి, తుడిచి వేయబడేవి చిన్నచిన్న పాపాలు, పెద్దపెద్ద పాపాలు (అల్-కబాయిర్) కాదు. పెద్ద పాపాల కొరకు అల్లాహ్ ముందు పశ్చాత్తాప పడుట తప్పనిసరి.