- పరిశుద్ధత రెండు రకాలు. భౌతిక పరిశుద్ధత, ఇది వుదూ చేయుట ద్వారా మరియు గుసుల్ చేయుట ద్వారా లభిస్తుంది. మరియు అంతరంగ పరిశుద్ధత – ఇది తౌహీద్, అచంచలమైన విశ్వాసము మరియు సత్కార్యములు ఆచరించుట ద్వారా లభిస్తుంది.
- ఇందులో సలాహ్ (నమాజు) యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది, అందుకంటే అది దాసుని ఇహలోక జీవితానికి మరియు పరలోక జీవితానికి కాంతి వంటిది.
- దానగుణము దాసుని విశ్వాసము యొక్క నిజాయితీకి నిదర్శనము.
- ఇందులో ఖుర్’ఆన్ యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది. ఖుర్’ఆన్ నందు విశ్వాసము మరియు దానిపై ఆచరించుట వలన ఖుర్’ఆన్ తీర్పు దినము నాడు దాసుని పక్షమున సాక్ష్యముగా నిలుస్తుంది, అతనికి వ్యతిరేకంగా కాదు.
- దాసుడు తన ఆత్మను అల్లాహ్ యొక్క విధేయతలో నిమగ్నమై ఉండేలా చేయకపోతే, అది అతడిని అల్లాహ్ యొక్క అవిధేయతలో నిమగ్నుడిని చేస్తుంది.
- ప్రతి మనిషీ తన జీవిక కొరకు తప్పనిసరిగా పని చేయాలి. అయితే, అతడు దాని ద్వారా ఈ ప్రాపంచిక ఆకర్షణలనుండి తన ఆత్మను స్వతంత్రించుకుని అల్లాహ్ యొక్క విధేయతలో గడుపుతాడు, లేక పాపకార్యములలో తనను తాను పడవేసుకుని శిక్షకు గురి అవుతాడు.
- సహనం వహించడానికి - ఓర్పు, నిలకడ, అర్థం చేసుకునే శక్తి అవసరం అవుతాయి. సహనం వహించడం కష్టముతో కూడుకుని ఉన్న పని.