అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయ...
ఈ హదీసులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపరుస్తున్నారు : కష్టాలు వచ్చి మీద పడడం, వాటి ద్వారా అల్లాహ్ విశ్వాసులైన స్త్రీలను, పురుషులను పరీక్షిం...
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనద...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి యొక్క స్థితి మరియు అతని వ్యవహారాల పట్ల ప్రశంసా పూర్వకమైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు; ఎందుకంటే అత...
అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎంతగా అనుగ్రహించే వాడో, ఎంతటి కరుణా ప్రధాతనో తెలిపినారు. ఒక ముస్లిం, ఒకవేళ అతడు (చిన్నవైనా సరే) సత్క...
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసిని మంచి పనులను చేయడం వేగవంతం చేయమని మరియు మంచి పనులు చేయడం అసాధ్యమయ్యే పరిస్థితులు రాకముందే వాటిని వ...
ముఆవియహ్ ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఎవరికైతే అల్లాహ్ శుభాన్ని కలుగజేయాలని తలపోస్తాడో, పరమ పవిత్రుడైన అల్లాహ్ అతనికి తన ధ...
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”
అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”
ముఆవియహ్ ఇబ్న్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “అల్లాహ్ ఒకవేళ ఎవరికైనా మేలు చేయదలుచుకుంటే, ఆయన అతడికి (ఇస్లాం) ధర్మము యొక్క లోతైన అవగాహనను కలుగజేస్తాడు. నిశ్చయంగా, నేను కేవలం చేరవేసే వాడిని మాత్రమే. ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే. (గుర్తుంచుకోండి) ఈ ఉమ్మత్ (కల్మషము లేని విశ్వాసము గలవారు) అల్లాహ్ యొక్క బోధనలు, ఆదేశలపై దృఢంగా మరియు స్థిరంగా నిలిచి యుండుట, అనుసరించుట ఎన్నటికీ విడనాడదు. ప్రళయ ఘడియ స్థాపితమయ్యేంత వరకు వేర్వేరు మార్గాలను (ధర్మాలను) అనుసరించేవారు వీరికి ఎటువంటి హాని కలుగజేయలేరు.
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు “పండితులు, విద్వాంసుల ముందు ప్రదర్శించే (ప్రదర్షనా) బుద్ధితోనో, లేక అఙ్ఞానులు, మూర్ఖులతో వాదించడానికో (వారిలో పైచేయి అనివిపించు కోవడానికో) ఙ్ఞాన సముపార్జన చేయకండి. అలాగే సమావేశాలలో ఉన్నత ఆసనం (కావాలని) ఎంచుకోకండి. ఎవరైతే అలా చేస్తారో – (వారి కొరకు) నరకాగ్ని, నరకాగ్ని”.
ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.
అబీ అబ్దుర్రహ్మాన్ అస్’సులమీ రహిమహుల్లాహ్ ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో, ఎవరైతే మాకు ఖుర్’ఆన్ పారాయణము చేసినారో (ఎవరి వద్దనైతే మేము ఖుర్’ఆన్ నేర్చుకున్నామో) – వారు మాతో ఇలా పలికినారు – తాము ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నుండి పది ఆయతులను వినే వారమని, వాటిలోని ఙ్ఞానమును పూర్తిగా నేర్చుకోనంత వరకు, మరియు (నేర్చుకున్న ఙ్ఞానాన్ని) నిజ జీవితములో అన్వయించుకోనంత వరకు మరొక పది ఆయతులకు వెళ్ళేవారము కాదు. వారు ఇంకా ఇలా అన్నారు – “ఆ విధంగా మేము ఙ్ఞానాన్ని, మరియు దాని అన్వయాన్ని కూడా నేర్చుకున్నాము”.
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా అల్లాహ్ యొక్క గ్రంథము (ఖుర్’ఆన్) నుండి ఒక్క అక్షరం పఠించినా అతనికి ప్రతిఫలంగా ఒక పుణ్యము లభిస్తుంది. ప్రతి పుణ్యము తనను పోలిన పది పుణ్యాలను తీసుకు వస్తుంది. (కనుక) “అలిఫ్, లామ్, మీమ్” ను నేను ఒక అక్షరం అనడం లేదు. (అందులో) “అలిఫ్” ఒక అక్షరం, “లామ్” ఒక అక్షరం మరియు “మీమ్” ఒక అక్షరం.” (అంటే దివ్య ఖుర్’ఆన్ గ్రంథము నుండి ఎవరైనా “అలిఫ్, లామ్, మీమ్” అని పఠిస్తే వారికి ప్రతి అక్షరానికి పది పుణ్యాలు లభిస్తాయిఅని అర్థము).
అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం – రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : “(పాపంచిక జీవితములో) తన మనసును ఖుర్’ఆన్ పఠనములో లగ్నము చేసుకున్న వానితో (తీర్పు దినమున) ఇలా అనడం జరుగుతుంది “ఏవిధంగానైతే నీవు ప్రాపంచిక జీవితములో ఖుర్’ఆన్ ను హృద్యంగా పఠించే వానివో అలా పఠిస్తూ (స్వర్గములో ఉన్నత స్థానములను) అధిరోహిస్తూ ఉండు. ఎక్కడైతే నీవు ఆఖరి ఆయతును పఠిస్తావో అదే నీ గమ్యస్థానము అవుతుంది.
అబీ హురైరహ్ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం:
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా తాను తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చినపుడు ఎదురుగా పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెలను చూడడానికి ఇష్టపడతారా?” దానికి మేమందరమూ “అవును, ఇష్టపడతాము” అన్నాము. అపుడు ఆయన “నీవు సలహ్ లో (నమాజులో) పఠించే మూడు ఆయతులు పెద్ద పెద్ద, బాగా బలిసిన మరియు గర్భముతో ఉన్న మూడు ఆడ ఒంటెల కంటే నీ కొరకు శుభప్రదమైనవి” అన్నారు.
అబూ మూసా అల్ అషారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఖుర్’ఆన్ పఠిస్తూ ఉండండి. ఎవరి చేతిలోనైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలున్నాయో ఆయన సాక్షిగా (చెబుతున్నాను), తమ (కాళ్ళ) కు కట్టివేసిన తాళ్ళ బంధనాల నుండి తప్పించుకునే ఒంటెల మాదిరిగా, ఖుర్’ఆన్ మీ జ్ఞాపకం (మెమొరీ) లో నుండి జారిపోతుంది”.