- ఈ హదీసులో ఖుర్’ఆన్ యొక్క ఘనత, దాని గౌరవము మరియు ఔన్నత్యము, ప్రాశస్త్యము వివరించబడ్డాయి. ఖుర్’ఆన్ అన్నింటి కంటే ఉత్తమమైన బోధన. ఎందుకంటే అది అల్లాహ్ యొక్క వాక్కు.
- ఙ్ఞానాన్ని సముపార్జించే వారిలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే తాము నేర్చుకున్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తారో. అలా కాక ఙ్ఞానసముపార్జన చేసి దానిని తమ వరకు మాత్రమే పరిమితం చేసుకునే వారు ఎంతమాత్రమూ కాదు.
- ఖుర్’ఆన్ కు సంబంధించి ఙ్ఞానసముపార్జన చేయడం మరియు బోధించడం అంటే, అందులో ఖుర్’ఆన్ పఠించడం, అందులోని ఆయతుల అర్థాలను మరియు ఆదేశాలను గ్రహించడం మరియు ఆ ఙ్ఞానాన్ని ఇతరులకు బోధించడం – ఇవన్నీ ఇమిడి ఉన్నాయి.