- ఈ హదీసు ద్వారా – తీర్పు దినము నాడు ప్రతిఫలము ప్రాప్తమగుట అనేది ఆచరణల యొక్క నాణ్యత మరియు శ్రేష్ఠతలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తున్నది.
- ఇందులో ఖుర్’ఆన్ ను పఠించుట, దానిని మననం చేయుట, అందులో నిపుణత, సంపూర్ణత సాధించుట, పఠించిన దానిని అవగాహన చేసుకొనుట మరియు దాని ప్రకారం ఆచరించుట – ఈ విషయాల వైపునకు ప్రోత్సాహము ఉన్నది.
- ఇందులో – స్వర్గము అనేక దశలు కలిగి ఉంటుందని మరియు అందులో ప్రవేశించే వారి స్థానములు అనేకముగా ఉంటాయని, (పైన వివరించిన విధంగా) ఎవరైతే ‘ఖుర్’ఆన్ ను’ తమ జీవితాలలో ఒక భాగంగా చేసుకుంటారో వారు స్వర్గములో ఉన్నతమైనా స్థానాలను పొందుతారని తెలుస్తున్నది.