- ఇందులో దివ్య ఖుర్’ఆన్ ను తరుచూ పఠిస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది.
- ఎందుకంటే అతను పఠించే ప్రతి పదములోని ప్రతి అక్షరానికి అతను ఒక పుణ్యఫలాన్ని పొందుతాడు, అది (ఆ ప్రతిఫలం) పదింతలుగా ఎక్కువ చేయబడుతుంది.
- అలాగే ఇందులో అల్లాహ్ యొక్క ఔదార్యము, ఆయన దాతృత్వము గురించి తెలుస్తున్నది. ఆయన తన దాసుల పట్ల తనకు గల కరుణతో వారి ఒక్క సత్కార్యానికి పదింతలు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
- అలాగే ఇందులో, మిగతా పదాలు మరియు ఆరాధనల కంటే, ఖుర్’ఆన్ లోని పదాలను పఠించడం ద్వారా చేయబడే ఆరాధన యొక్క యొక్క ఘనత తెలుస్తున్నది. ఎందుకంటే ఖుర్’ఆన్ అల్లాహ్ యొక్క వాక్కు గనుక.