- ఇందులో, తన దాసుల కొరకు అల్లాహ్ యొక్క కారుణ్యం ఎంత విస్తృతమైనదో తెలుస్తున్నది.
- ఇందులో, అల్లాహ్ యొక్క ఆరాధనలకు మరియు విధేయతకు సంబంధించిన విషయాలలో (మంచిపనులు చేసే విషయంలో) మనం ఆరోగ్యంగా ఉన్న సమయాన్ని మరియు మన తీరిక, సావకాశ సమయాలను విస్తృతంగా వినియోగించుకోవాలనే హితబోధ ఉన్నది.