ఆయిషా (రదియల్లాహు అన్హా) తనకు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ నేర్పించినారని ఉల్లేఖిస్తున్నారు: “అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి కుల్లిహి, ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; వ అఊజుబిక మిన్ షర్రి కుల్లిహి ఆ’జిలిహి, వ ఆజిలిహి, మా అలింత మిన్హు మాలం, అ’అలం; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఖైరి మా సఅలక అబ్దుక వ నబియ్యుక; వ అఊజుబిక మిన్ షర్రి మా అజాబిహి అబ్దుక వ నబియ్యుక; అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ జన్నత, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అఊజుబిక మినన్నారి, వమా ఖర్రబ ఇలైహ మిన్ ఖౌలిన్ అవ్ అమలిన్; వ అస్అలుక అన్’తజ్’అల కుల్ల ఖదాయిన్ ఖదైతహు లీ ఖైరన్”.
(ఓ అల్లాహ్! నేను ప్రతి శుభాన్ని ప్రసాదించమని నిన్ను అడుగుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; మరియు ప్రతి చెడు నుండి, ప్రతి కీడు నుండి, వినాశం కలిగించే ప్రతి దాని నుండి నీ రక్షణ కోరుతున్నాను, అది త్వరగా (సమీప భవిష్యత్తులో) రాబోయేదైనా, లేక ఆలస్యంగా రాబోయేదైనా, దానిని గురించిన ఙ్ఞానము నాకు ఉన్నా, లేకపోయినా; ఓ అల్లాహ్! నీ దాసుడు మరియు నీప్రవక్త నిన్ను కోరిన మంచి కొరకు నేను నిన్ను అడుగుతున్నాను మరియు నీ సేవకుడు మరియు ప్రవక్త శరణు కోరిన చెడు నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను, నీ రక్షణ కోరుతున్నాను; ఓ అల్లాహ్! నేను నిన్ను స్వర్గం కొరకు అడుగుతున్నాను, మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణల కొరకు కూడా; నరకాగ్ని నుండి నీ రక్షణ కోరుతున్నాను మరియు దానికి చేరువ చేసే మాటలు మరియు ఆచరణలనుండి కూడా. మరియు (ఓ అల్లాహ్!) నీవు నా కొరకు నిర్ణయించిన ప్రతి ఉత్తర్వును, ప్రతి ఆదేశాన్ని, నా కొరకు మంచిదిగా చేయమని నేను నిన్ను అడుగుతున్నాను.)