వివరణ
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం మరియు సాయంకాలములలో ఎప్పుడూ ఈ దుఆ చేయకుండా ఉండలేదు.
(అల్లాహుమ్మ అస్అలుకల్ ఆఫియత) ఓ అల్లాహ్! నాపై త్వరలో వచ్చి పడబోయే, లేక ఆలస్యంగా వచ్చి పడబోయే వ్యాధులు, దురదృష్టాలు, ప్రాపంచిక ప్రతికూలతలు, కోరికలు మరియు ధర్మపరమైన పరీక్షల నుండి రక్షణ ప్రసాదించి ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని నేను నిన్ను కోరుతున్నాను.
(అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ, వల్ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ) ఓ అల్లాహ్! నేను నీ క్షమాపణను వేడుకుంటున్నాను, నా పాపాలను తుడిచి వేయమని, మరియు వాటిని ఉపేక్షించమని వేడుకుంటున్నాను, నా తప్పులనుండి నాకు రక్షణ కల్పించి, నా ధర్మములో బహుదైవారాధన నుండి, ధర్మములో కొత్త విషయాలను జొప్పించుట నుండి, నా ప్రాపంచిక జీవితములో కష్ఠాలు, హాని, విపత్తులు మరియు చెడుల నుండి నాకు రక్షణను ఇవ్వమని వేడుకుంటున్నాను; మరియు నా కుటుంబములో, నా భార్యలు, నా సంతానము, నా బంధువులు, నా సంపద, నా ధనము నా ఉద్యోగము అన్నింటిలో శ్రేయస్సు కలిగించమని వేడుకుంటున్నాను.
(అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ) ఓ అల్లాహ్, నా లోపాలను, నా దోషాలను, కొరతలను కప్పివేయి, నా పాపాలను తుడిచివేయి, భయం మరియు ఆందోళణలనుండి నన్ను సురక్షితంగా ఉంచు.
(అల్లాహుమ్మఫజ్’నీ మిమ్’బైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ, వఅన్ షిమాలీ, వ మిన్ ఫౌఖీ)
ఓ అల్లాహ్, బాధల నుండి మరియు హానికరమైన వాటి నుండి, నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి, నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. అన్ని దిశల నుండి రక్షించమని అల్లాహ్ కోరడం ఎందుకంటే, ప్రతికూలతలు, దురదృష్టాలు ఈ దిశలలో ఒకదాని నుండి మాత్రమే మనిషిని ప్రభావితం చేయగలవు, మరియు చేరుకోగలవు కనుక.
(వ అఊజు బి అజ్మతిక, అన్ ఉగ్'తాల) మరియు ఓ అల్లాహ్! నేను అకస్మాత్తుగా చంపబడకుండా, మరియు నా క్రిందనుండి అకస్మాత్తుగా భూమి నన్ను మ్రింగి వేయకుండా నీ ఘనతను, మరియు నీ గొప్పతనాన్ని ఆశయిస్తున్నాను.