- ఆహారం మరియు పానీయాల మాధుర్యాన్ని నోటిలో రుచి చూసినట్లే విశ్వాసపు తీపి మరియు మాధుర్యమును హృదయాలు గ్రహిస్తాయి.
- ఆరోగ్యంగా ఉన్నప్పుడు తప్ప శరీరానికి ఆహారం మరియు పానీయం యొక్క తీపి తెలియదు. అదే విధంగా హృదయం కూడా. అది తప్పుదోవ పట్టించే కోరికలు మరియు నిషేధించబడిన వాంచల వ్యాధి నుండి విముక్తి పొందినట్లయితే, అది విశ్వాసం యొక్క మాధుర్యాన్ని కనుగొంటుంది. మరియు (కోరికలు, వాంఛలతో) జబ్బుపడి, కీడు పట్టిన హృదయం విశ్వాసపు మాధుర్యాన్ని గ్రహించదు. కానీ కోరికలు మరియు పాపాల నుండి దానిని నాశనం చేసే వాటిలో అది మాధుర్యాన్ని కనుగొంటుంది.
- ఒక వ్యక్తి ఒక విషయంతో సంతృప్తి చెంది, దానిని ఆమోదించుకున్నట్లయితే, ఆ విషయం అతనికి సులభం అవుతుంది, మరియు అతనికి ఏమీ కష్టం కాదు, మరియు ఆ విషయం తెచ్చే ప్రతిదానిలోనూ అతడు ఆనందిస్తాడు మరియు దాని ఉల్లాసం అతని హృదయంలో కలిసిపోతుంది. అలాగే విశ్వాసి కూడా. విశ్వాసం అతని హృదయంలోకి ప్రవేశిస్తే, తన ప్రభువుకు విధేయత చూపడం అతనికి సులభం అవుతుంది మరియు అతని ఆత్మ అతనికి ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఒకవేళ ఆ విశ్వాసం కారణంగా అతనికి ఏదైనా బాధ కలిగినా అది అతనికి కష్టంగా అనిపించదు.
- ఇమాం ఇబ్న్ అల్ ఖయ్యిం (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు:
- ఈ హదీథులో తన ప్రభువుతో ఆయన దైవత్వముతో సంతృప్తి, ఆయన సందేశహరునితో సంతృప్తి మరియు ఆయనకు విధేయత చూపుట, మరియు అల్లాహ్ యొక్క ధర్మము (ఇస్లాం)తో సంతృప్తి మరియు ఆ ధర్మానికి లోబడి ఉండుట వంటివి ఉన్నాయి.