/ “అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”

“అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “అల్లాహ్ ఎదుట అత్యంత గౌరవనీయమైనది ‘దుఆ’ తప్ప మరింకేమీ లేదు”.

వివరణ

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – అల్లాహ్ వద్ద, ఆరాధనలలో దుఆ కంటే ఉత్తమమైన విషయం ఏదీ లేదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే అందులో ప్రతి విషయంలోనూ పరమ పవిత్రుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క సుసంపన్నత కీర్తించబడుతుంది, అలాగే అందులో ఆయన ఎదుట ప్రతి విషయం లోనూ దాసుని అసహాయత, అతని లేమి ప్రకటితమవుతుంది.

Hadeeth benefits

  1. ఈ హదీసులో దుఆ యొక్క ఘనత తెలియజేయ బడుతున్నది. దుఆ చేయు వాని కొరకు అల్లాహ్ ఆరాధ్యుడు, మహిమాన్వితుడు మరియు అన్ని విషయాలలోనూ అత్యంత సంపన్నుడు. ఈ విషయాలన్నీ అతడు మనస్ఫూర్తిగా విశ్వసిస్తాడు, అంగీకరిస్తాడు. కనుకనే ఆయనను వేడుకుంటాడు. పేదవానిని వేడు కొనడు. ఆయన దుఆ వింటాడు, చెవిటి వాడు వినలేడు, ఆయన ఔదార్యము కలవాడు, కృపాశీలుడు, దాత; పిసినారిని వేడుకొనరు; ఆయన అనంత కరుణామయుడు, కఠినాత్ముడిని వేడుకొనరు, ఆయన సమర్థుడు, అసమర్థుడిని, అసహాయుడిని ఎవరూ వేడుకొనరు, ఆయన అత్యంత చేరువలో ఉన్నవాడు, దూరంగా ఉన్నవాడు వినలేడు. ఇవి పరమ పవిత్రుడూ, మహోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క ఘనత, మహత్వము, ప్రభుత యొక్క లక్షణాలలో కొన్ని అత్యంత సుందరమైన విషయాలు.