- ఈ హదీసులో, తన ప్రభువు పట్ల, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విధేయతను చూడవచ్చు, మరియు ఆయనను వేడుకొవడం చూడవచ్చు; అలాగే ఆ విధంగా దుఆ చేయమని తన ఉమ్మత్’కు మార్గనిర్దేశం చేయడాన్ని చూడవచ్చు.
- ధర్మములో స్థిరంగా ఉండుట; మరియు స్థిరంగా ఉండుట కొరకు పట్టుదల యొక్క ఆవశ్యకత తెలుస్తున్నది. వాస్తవానికి ప్రతి వ్యక్తికీ అతని ముగింపే కదా ముఖ్యం!
- అల్లాహ్ యొక్క దాసుడు, అల్లాహ్ అతడిని ఇస్లాం పై స్థిర పరచకపోతే, కనురెప్ప ఆడినంత కాలం కూడా ఇస్లాం పై స్థిరంగా ఉండగలిగే శక్తి అతనికి లేదు.
- ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క బోధనను అనుసరిస్తూ, సర్వోన్నతుడైన అల్లాహ్’తో ఈ దుఆను తరుచూ చేస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది.
- ఇస్లాం ధర్మం పై స్థిరత్వం అనేది అల్లాహ్ తరఫు నుండి ప్రసాదించబడే ఒక గొప్ప అనుగ్రహం. అందుకు దాసుడు తన ప్రభువుకు అన్ని వేళలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దానిని సాధించుట కొరకు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి.