/ “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.”

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.”

ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా అల్లాహ్’ను స్మరించేవారు.”
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు

వివరణ

ఆయిషా రజియల్లాహు అన్హా – విశ్వాసుల మాతృమూర్తి – ఇలా ఉల్లేఖిస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్మరించుటలో ఎక్కువ చురుకుగా, ఉత్సాహంగా, ఆసక్తి కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అన్నివేళలా, అన్ని స్థితులలో మరియు ఏ ప్రదేశములో నైనా అల్లాహ్ ను స్మరిస్తూ ఉండేవారు.

Hadeeth benefits

  1. చిన్న హదస్ స్థితిలో ఉన్నా (అంటే వుజూ చేయవలసి ఉన్న స్థితిలో ఉన్నా), లేక పెద్ద హదస్ స్థితిలో ఉన్నా (అంటే గుసుల్ చేయవలసి ఉన్న స్థితిలో ఉన్నా), అల్లాహ్ యొక్క జిక్ర్ (స్మరణ) చేయుటకు వుజూ కానీ, గుసుల్ కానీ చేసి తప్పనిసరిగా పరిశుధ్ధత పొందవలసిన అవసరం లేదు.
  2. అల్లాహ్ ను స్మరించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరంతరం శ్రధ్ధ చూపేవారు.
  3. ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఆదర్శంగా తీసుకుని వారిని అనుసరిస్తూ అల్లాహ్ ను అన్నివేళలా స్మరిస్తూ ఉండాలనే హితబోధ ఉన్నది – అయితే ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ స్మరణను చేయకుండా ఉండేవారో ఆ సమయాలలో తప్ప, అంటే ఉదాహరణకు – కాలకృత్యాలు తీర్చుకొను సమయాన (బాత్రూమ్ లో).