అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహమ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా స్పష్ఠపరిచినారు – (వివాహ సమయమున) ఆమె తరఫున ఆమె సంరక్షకుడు ఉంటే తప్ప, ఒక స్త్రీ యొక్క వివాహము సక్రమమైనది...
ఉఖబా ఇబ్న్ ఆమిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు) విధించుకునే షరతుల...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: (వివాహములో) దాంపత్య జీవితం అనుభవించుటను ధర్మ సమ్మతం చేసే షరతును అన్నింటి కంటే ముందుగా నెరవేర్చవలె...
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము...
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియజేశారు: ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్నదంతా ఒక (పరిమిత కాలపు) సంతోషము, ఆనందము మాత్రమే. తరువాత అది అంతమ...
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించ...
జరీర్ ఇబ్న్ అబ్దుల్లా (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒక వ్యక్తి ఒక పరాయిస్త్రీని అకస్మాత్తుగా చూడటం గురించి అడిగారు. దానికి ఆయన...
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు...
ఈ హదీథులో అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-అద్’హా రోజున నలుపుతో కలిసిన తెల్లని కొమ్ములతో ఉన్న ర...
అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “వలీ (వధువు తరఫున ఆమె సంరక్షకుడు) లేకుండా వివాహము పూర్తి కాదు”.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”.
జరీర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను (పరస్త్రీపై) అనుకోకుండా, ఆకస్మికంగా పడిన చూపును గురించి ప్రశ్నించాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఆదేశించినారు “నీ చూపును మరల్చుకో”
అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని ఆయన తన స్వంత చేతులతో ఖుర్బానీ చేసినారు. అపుడు, ఆయన ఇలా అన్నారు: "బిస్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్!” మరియు వాటి మెడ మీద తన పాదాన్ని ఉంచినారు.”
అబ్దుర్రహ్మాన్ ఇబ్నె అబూ లైలా ఉల్లేఖనం : “మేము హుజైఫహ్ వద్ద కూర్చుని ఉన్నాము. అతడు నీళ్ళు తీసుకురమ్మని అడిగాడు. ఒక మజూసీ అతనికి నీళ్ళు తెచ్చాడు. కానీ ఎపుడైతే అతడు నీటి కప్పును అతని చేతిలో ఉంచినాడో, హుదైఫహ్ దానిని అతని పైకి విసిరినాడు. తరువాత ఇలా అన్నాడు: “అలా చేయవద్దని నేను ఇప్పటికే ఒకటి, రెండుసార్లు అతనికి చెప్పి ఉండకపోతే...” “నేను ఇలా చేసి ఉండే వాడిని కాదు” అని అనాలని బహుశా ఆయన అనుకున్నాడు. (ఆయన ఇంకా ఇలా అన్నాడు) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను: “పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించకండి, వెండి లేక బంగారపు పాత్రలలో నీళ్ళు త్రాగకండి, మరియు వాటితో చేసిన పళ్ళాలలో తినకండి; ఎందుకంటే (ఈ ప్రాపంచిక జీవితంలో) అవి వారి కొరకు (అవిశ్వాసుల కొరకు); మన కొరకు పరలోక జీవితంలో ఉన్నాయి.”
అలీ (రదియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముగ్గురి పైనుండి (మూడు రకాల వ్యక్తులపైనుండి) కలము లేపివేయబడినది (వారిని గురించి ఏమీ నమోదు చేయదు); వారు: నిద్రిస్తున్న వ్యక్తి అతడు నిద్రనుంచి మేల్కొనేంత వరకు; యుక్త వయస్సుకు చేరని బాలుడు/బాలిక అతడు యుక్తవయస్సుకు చేరేంతవరకు, మరియు మతిస్థిమితము కోల్పోయిన పిచ్చివాడు, అతడు తిరిగి మతిస్థిమితం పొందేంతవరకు.”
అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఒక పురుషుడు మరో పురుషుని ‘ఔరహ్’ ను చూడరాదు. మరియు ఒక స్త్రీ మరో స్త్రీ ‘ఔరహ్’ ను చూడరాదు. అలాగే ఇద్దరు పురుషులు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు, మరియు ఇద్దరు స్త్రీలు ఒకే వస్త్రములో (లేదా ఒకే వస్త్రము క్రింద నగ్నంగా) పడుకోరాదు.”
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “విశ్వాసి తన సత్ప్రవర్తన, సభ్యత, ఉత్తమ నడవడికల ద్వారా పుష్కలంగా సలాహ్ (నమాజు) లు మరియు ఉపవాసాలు ఆచరించే వాని స్థాయిని పొందుతాడు”.