/ నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”

నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అశ్లీల, అసభ్య వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదు. ఆయనెప్పుడూ అశ్లీల, అసభ్య భాషను ఉపయోగించలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనేవారు: “నిశ్చయంగా మీలో ఎవరైతే ఉత్తమ నడవడిక కలిగి ఉంటారో, వారే ఉత్తములు”.
ముత్తఫిఖ్ అలైహి

వివరణ

అసభ్యకరంగా మాట్లాడుట (ఉదా: తిట్లు, బూతులు) లేక అసభ్యకరమైన చేష్టలు చేయుట అనేవి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వంలో లేని విషయాలు. ఉద్దేశ్యపూర్వకంగా గానీ లేదా అనుకోకుండా గానీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ అలాంటి మాటలు గానీ చేష్టలుగానీ చేయలేదు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యుత్తమ నైతిక విలువలు, ప్రశంసనీయమైన వ్యక్తిత్వం కలిగిన మహావ్యక్తి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండేవారు: “అల్లాహ్ దృష్టిలో మీలో ఉత్తములు ఎవరంటే – ఎవరైతే సత్ప్రవర్తన, ఉత్తమ వ్యక్తిత్వము కలిగిఉంటారో, సత్కార్యములు చేస్తూ ఉంటారో, ఎటువంటి సంకోచమూ లేకుండా ముఖములో ప్రశాంతత కలిగి ఉంటారో, ఎవరికైనా హాని, నష్టము కలిగించుట నుండి దూరంగా ఉంటారో, ఎవరైనా తనకు హాని గానీ, నష్టముగాని కలిగిస్తే సహనము వహిస్తారో, మరియు ప్రజలను సౌహార్ద్రము, దయ, కరుణలతో కలుస్తారో”.

Hadeeth benefits

  1. విశ్వాసి అశ్లీలతల నుండి దూరంగా ఉండాలి, ఉదాహరణకు చెడు మాటలు మాట్లాడుట నుండి మరియు చెడు పనులు చేయుట నుండి.
  2. ఈ హదీసు ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము యొక్క సంపూర్ణత (ఎలాటి లోపాలూ, కొరతలూ లేని వ్యక్తిత్వం) గురించి తెలుస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నుండి కేవలం మంచితనము, మంచి పనులు మరియు ఉత్తమమైన సంభాషణ తప్ప మరేమీ బహిర్గతం కాలేదు.
  3. ఉత్తమ వ్యక్తిత్వము ఒక పోటీ మైదానము వంటిది – అందులో ఎవరు ముందుంటారో వారు విశ్వాసులలో ఉత్తములు మరియు విశ్వాసములో సంపూర్ణత కలిగిన వారూను.