- ఇందులో పట్టు వస్త్రాలను లేక జరీ వస్త్రాలను ధరించరాదని పురుషులకొరకు నిషేధము ఉన్నది, మరియు ఎవరైతే ధరిస్తారో వారికి కఠినమైన హెచ్చరిక ఉన్నది.
- అయితే స్త్రీలు పట్టు వస్త్రాలను మరియు జరీ వస్త్రాలను ధరించ వచ్చును, అందుకు వారికి అనుమతి ఉన్నది.
- అలాగే ఇందులో బంగారు మరియు వెండి పళ్ళాలు మరియు పాత్రలలో తినుట త్రాగుట చేయరాదని పురుషులకు మరియు స్త్రీలకు నిషేధము ఉన్నది.
- హుదైఫహ్ రజియల్లాహు అన్హు చెడు నుండి దూరంగా ఉండడం పట్ల చాలా కఠినంగా ఉంటారు. ఈ హదీథులో తాను ఆ మజూసీ వాడిని బంగారు వెండి పాత్రలను ఉపయోగించకు అని ఒకటి రెండు సార్లు నిషేధించానని, కానీ అతడు వాటిని వినియోగించడం ఆపలేదని వివరిస్తున్నారు.