- ‘హలాల్’ (ధర్మసమ్మతమైన) విషయాన్ని ‘హరాం’ (నిషేధము) చేసే లేదా ‘హరాం’ విషయాన్ని ‘హలాల్’ గా చేసే ఏదైనా షరతు ఉంటే తప్ప, ‘వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకున్న షరతులను వారు తప్పనిసరిగా (వాజిబ్ గా) పాటించాలి, నెరవేర్చాలి, పూర్తిచేయాలి.
- వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకున్న షరతులను నెరవేర్చుట, మిగతా షరతులను నెరవేర్చుట కంటే అత్యంత ఎక్కువ ప్రాధాన్యత కలిగిన విషయము. ఎందుకంటే అవి వారి దాంపత్య జీవితాన్ని ధర్మసమ్మతం చేస్తాయి గనుక.
- వివాహ సమయాన వధూవరులు ఒకరిపైనొకరు విధించుకునే షరతులు పాటించుటను, నెరవేర్చుటను తప్పనిసరి (వాజిబ్) చేయుట, ఇస్లాంలో వివాహము యొక్క ప్రతిష్ఠ, స్థాయి ఎంత ఘనమైనదో తెలియజేస్తున్నది.