అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమ...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు అల్లాహ్ రమజాన్ నెల ఉపవాసములు ఆచరించుటను విధిగ...
ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన...
రమదాన్ మాసంలోని చివరి పది రాత్రులు ప్రవేశిస్తూనే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన మరియు విధేయత యొక్క పనులలో, ఆచరణలలో ఎక్కువగా శ్రమ పడేవారు. ఆయన...
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినమ...
ఈ హదీథులో అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియజేస్తున్నారు: తన ప్రాణమిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తనకు మూడు విషయాల గురించి హితబోధ చేస...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్ర...
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘లైలతుల్ ఖద్ర్’ లో అల్లాహ్ యొక్క ఆరాధనలలో గడపడం యొక్క ఘనతను తెలియ జేస్తున్నారు. అది రమజాన్ నెల ఆఖరి పది రాత్...
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందు...
ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమని వివరిస్తున్నారూ అంటే “ఎవరైతే కేవలం సర్వోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే హజ్ చేస్తాడో మరియు అశ్లీలతలకు...

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.

ఉమ్ముల్ ము'మినీన్, విశ్వాసుల మాత అయిన ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చివరి పదింటిలో (పది రాత్రులలో) మిగతా సమయాలన్నింటి కంటే కూడా (ఆరాధనలో) ఎక్కువగా శ్రమించేవారు.”

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నా మిత్రుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు మూడు విషయాల గురించి హితబోధ చేసినారు. ప్రతి నెల మూడు దినములు ఉపవాసములు పాటించమని; రెండు రకాతులు సలాత్ అద్’దుహా ఆచరించమని; రాత్రి నిద్ర పోవడానికి ముందు విత్ర్ సలాహ్ ఆచరించమని.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ ‘లైలతుల్ ఖద్ర్’ లో (రమజాన్ నెలలోని ఘనమైన రాత్రి) నమాజు ఆచరిస్తూ (అల్లాహ్ ఆరాధనలలో) గడుపుతారో అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు హజ్ చేస్తారో, అందులో (తన భార్యతో) లైంగిక చర్యలకు మరియు అశ్లీల సంభాషణలకు, చెడు పనులకు పాల్బడడో – అతడు తన తల్లి తనకు జన్మనిచ్చిన దినము వలే తిరిగి వస్తాడు.

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు: “ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.

అబూ అల్ హవ్’రా అస్-స’దీ ఇలా పలికినారు: “హసన్ ఇబ్న్ అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హుమా) ను నేను ఇలా అడిగాను: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నీవు ఏమి కంఠస్థము చేసినావు?” దానికి ఆయన ఇలా బదులు పలికినారు: రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను దీనిని కంఠస్థము చేసినాను - “సందేహాస్పదమైన విషయాన్ని, సందేహాస్పదం కాని దాని కొరకు (స్పష్టంగా ఉన్న దాని కొరకు) వదిలి వేయి. నిశ్చయంగా సత్యసంధత ప్రశాంతతను కలిగిస్తుంది, అసత్యం అనుమానానికి దారి తీస్తుంది”

అబూ హురరైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ నా సమాజాన్ని (ఉమ్మత్’ను) వారి మనస్సులలోనికి వచ్చే (పరిపరి విధాల) ఆలోచనల కొరకు వారిని క్షమించాడు – వారు ఆ ఆలోచనలను ఆచరణలో పెట్టనంత వరకు, లేక వాటిని బయటకు ఉచ్చరించనంత వరకు.”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్ మీ బాహ్య రూపాన్ని గానీ లేక మీ సంపదలను గానీ చూడడు. కానీ మీ హృదయాలను మరియు మీ ఆచరణలను చూస్తాడు”.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.

అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”