- ఈ హదీథులో జిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినములలో చేసే సత్కార్యాల ఘనత తెలుస్తున్నది. కనుక ప్రతి ముస్లిం ఈ జిల్ హిజ్జహ్ మాసపు మొదటి పది దినముల ప్రయోజనం పొందడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. ఈ పది రోజులలో అల్లాహ్ కు విధేయత ప్రకటించే అనేక రకాల ఆచరణలను చేయాలి – ఉదాహరణకు సర్వ శక్తిమంతుడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ను కీర్తించడం, ఆయన ఘనతను కొనియాడడం (జిక్ర్, అజ్కార్ మొ.), నమాజులను విడవకుండా ఆచరించడం (ఎక్కువగా నఫీల్ నమాజులను ఆచరించడం), పేదలకు వీలైనంతగా దానధర్మాలు చేయడం, ఉపవాసాలు పాటించడం, మిగతా అన్ని రకాల మంచి పనులు కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే చేయటం.