- ఘోరమైన పాపాలలో కెల్లా అత్యంత ఘోరమైన పాపము అల్లాహ్ కు సాటి కల్పించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఘోరమైన పాపాలలో కెల్లా అతి ఘోరాతి ఘోరమైన వాటిలో మొట్టమొదటి స్థానములో ఉంచినారు. దీనిని అల్లాహ్ కూడా ఖుర్ఆన్ లో ఇలా ధృవీకరిస్తున్నాడు: { నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామి (సాటి) కల్పించడాన్ని ఏమాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహా పాపం చేసిన వాడు!} [సూరాహ్ అన్’నిసా 4:48]
- అదే విధంగా ఇక్కడ తల్లిదండ్రుల హక్కుల ఘనత గురించి కూడా తెలుస్తున్నది. వారి హక్కులను అల్లాహ్ యొక్క హక్కులతో జత చేయడం జరిగింది.
- పాపములలో ‘ఘోరమైన మహాపాపములు’ మరియు ‘చిన్న పాపములు’ అని రెండు విధాలుగా ఉన్నాయి: ఘోరమైన మహాపాపములు అంటే: వాటికి ప్రపంచములోని శిక్ష నిర్ధారించబడి ఉంది, ఉదాహరణకు మరణ శిక్ష, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష మొదలైనవి. అలాగే పరలోకములోని కఠిన శిక్షల గురించి ప్రస్తావించబడి ఉంది – అంటే ఉదాహరణకు నరకాగ్నిలో వేయబడుట. అలాగే ఘోరమైన మహాపాపములలో కూడా శ్రేణులు ఉన్నాయి. కొన్ని అసహ్యకరమైనవి (నీచాతి నీచమైన స్థాయికి చెందినవి), మరికొన్ని నిషేధస్థాయికి చెందినవి. ‘చిన్న పాపములు’ అంటే పైన పేర్కొన్న ఘోరమైన పాపములు కాక మిగిలిన ఇతర పాపములు.